వలంటీర్ల విధులు చేయలేం
ABN , Publish Date - Oct 06 , 2025 | 01:09 AM
వలంటీర్ల విధుల నుంచి సచివా లయ ఉద్యోగులకు విముక్తి కలిగించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని రాష్ట్ర సచివా లయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ ఎండీ జానీ పాషా, సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ,కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్ హెచ్చరిం చారు.
రాజమహేంద్రవరం, అక్టోబరు 5 (ఆంధ్ర జ్యోతి) : వలంటీర్ల విధుల నుంచి సచివా లయ ఉద్యోగులకు విముక్తి కలిగించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని రాష్ట్ర సచివా లయ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ ఎండీ జానీ పాషా, సెక్రటరీ జనరల్ విప్పర్తి నిఖిల్ కృష్ణ,కన్వీనర్ షేక్ అబ్దుల్ రజాక్ హెచ్చరిం చారు.రాజమహేంద్రవరం ఆనం కళా కేం ద్రంలో ఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఐక్యవేదిక ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ప్రాంతీయ సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులకు నోష నల్ ఇంకిమ్రెంట్లు ఇవ్వాలని, వలంటీర్ విధుల నుంచి విముక్తి కల్పిం చాలని, ఆరే ళ్లుగా ఒకే క్యాడర్‌లో పనిచేస్తున్నందున ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా స్పెషల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని, రికార్డు అసిస్టెంట్ పేస్కేల్‌తో క్యాడర్ అప్ గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు బత్తుల అంకమ్మరావు, యువ షణ్ముఖ, కేవీ.రాజేష్‌బాబు, వి.భార్గవ్ సుతేజ్, ఎస్‌కె.మహమూబ్,జీవీఎస్ శ్రీనివాస్, కె.షాలెం, కృష్ణ వెస్లీ, ఆళ్ల శ్రీధర్‌రెడ్డి, బి.రోజా ప్రకాష్, ఎస్.నాగేశ్వరరావు, ఎస్‌కె మహబూబా సు భానీ, దడాల జగ్గారావు, నవకోటి జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.