Share News

వలంటీర్లలా చేయలేం!

ABN , Publish Date - Sep 07 , 2025 | 12:59 AM

సచివాలయ ఉద్యోగులు ఆందోళనబాట పట్టా రు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు.

వలంటీర్లలా చేయలేం!
పిఠాపురం మునిసిపాలిటీలో నల్లబ్యాడ్జీలతో సచివాలయ ఉద్యోగుల నిరసన

నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన

రిజిస్ట్రేషన్‌ విధులు బహిష్కరణ

పిఠాపురం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సచివాలయ ఉద్యోగులు ఆందోళనబాట పట్టా రు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. మునిసిపల్‌, నగరపంచాయతీ, మండలపరిష త్‌ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. వాట్సాప్‌ సర్వీస్‌ రిజిస్ట్రేషన్‌ విధులను సామూహికంగా బహిష్కరించారు.ఆత్మగౌరవం కోసమే తాము ఆందోళన బాట పట్టామని వారు స్పష్టం చేశారు. ఒక క్లస్టర్‌లో వలంటీర్‌ విధులను సచివా లయ ఉద్యోగులకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు శనివారం నుం చి ఆందోళన చేపట్టారు. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. గతం లో వలంటీర్లు ఒక క్లస్టర్‌కు పరిమితమై విధులు నిర్వహించారని, ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు ఒకటి కంటే ఎక్కువ క్లస్టర్లు అప్పగిస్తూ మ్యాప్‌ చేయడంతో పాటు బలవంతంగా ఇంటింటికి తిరిగి విధులు నిర్వర్తించే బాధ్యతలు అప్పగిస్తున్నారని తెలిపారు. ఇదే రీతిలో వాట్సాప్‌ గవర్నెన్స్‌పై ఇంటింటా తిరిగి అవగాహన కల్పించడంతో పాటు ప్రతి ఇంటికి సర్వీస్‌ నమోదు చేయించాలని సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అధి కారులు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయ ఉద్యోగులు గూగుల్‌మీట్‌ ద్వారా సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం వాట్సాప్‌ సర్వీస్‌ రిజిస్ట్రేషన్‌ విధులను బహిష్కరించాలని, నల్లబ్యాడ్జిలతో నిరసన తెలపాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక స్టీరింగ్‌ కమి టీ నిర్ణయించింది. దీనికి అనుగుణంగా పిఠాపురం మునిసిపల్‌ కార్యాలయంతో పాటు కాకినాడ జిల్లాలోని పెద్దాపురం, సామర్లకోట, తుని పురపాలక సంఘాలు, గొల్లప్రోలు, ఏలేశ్వర నగరపంచాయతీలు, కాకినాడ కార్పోరేషన్‌ కా ర్యాలయాల వద్ద నల్లబ్యాడ్జీలు ఽధరించి వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎక్కడిక్కడ ఆందోళనలు నిర్వహించారు. గ్రామ, సచివాలయ ఉద్యోగుల మనోవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే నిరసన తెలియజేస్తున్నామని సచివాలయ ఉద్యోగులు స్పష్టం చేశారు.

Updated Date - Sep 07 , 2025 | 12:59 AM