Share News

సచివాలయ సిబ్బందిపై పర్యవేక్షణ ఉండాలి

ABN , Publish Date - Jun 21 , 2025 | 01:15 AM

సచివాలయ సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కావాలని ఎంపీపీ తేతలి సుమ సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశా నికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ఇటీవల తాను పలు సచివాలయాలను సందర్శించినపుడు సిబ్బం ది అందుబాటులో లేరన్నారు. అసలు విధులకు హాజరయ్యారో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.

సచివాలయ సిబ్బందిపై పర్యవేక్షణ ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ సుమ

  • బిక్కవోలు మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ సుమ

బిక్కవోలు, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): సచివాలయ సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కావాలని ఎంపీపీ తేతలి సుమ సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశా నికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ఇటీవల తాను పలు సచివాలయాలను సందర్శించినపుడు సిబ్బం ది అందుబాటులో లేరన్నారు. అసలు విధులకు హాజరయ్యారో లేదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. సి బ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని, బయటకు వెళ్లేటప్పు డు మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో రాసి వారి బాధ్యతలను పక్క వారికి అప్పగించాలన్నారు. తల్లికి వందనం, రైతు భరో సా నిధులు ఎందుకు జమ కాలేదన్న కారణం తెల్సుకోడానికి లబ్ధిదారులు సచివాలయాలకు వస్తే కారణం చెప్పేందుకు కొన్ని సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండడం లేదన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందేటట్టు చూడవలసిన బాధ్యత సచివాలయ సిబ్బందిదేనని, వారి పనితీరును కార్యదర్శులు కూడా పర్యవేక్షించాలన్నారు. ప్రతీ గ్రామంలో నిర్వహించే యోగాంరఽధ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సభలో అన్ని శాఖల అధికారులు తమ ప్రగతిని వివరించారు. సమావేశంలో జడ్పీటీసీ రొంగల పద్మావతి, వైస్‌ ఎంపీపీ కేతా మంగయ్యమ్మ, తహశీల్దార్‌ సత్యకృష్ణ ఎంపీడీవో వి.శ్రీనివాస్‌, ఏవో నాగేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2025 | 01:15 AM