క్రీడా అకాడమీలకు పూర్వవైభవం
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:24 AM
కార్పొరేషన్ (కాకినాడ), సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ క్రీడా అకాడమీలను త్వరలో పునఃప్రారంభించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చర్యలు చేపట్టిందని బోర్డు సభ్యుడు, అకాడమీస్ కమిటీ సభ్యుడు ఎ.రమణారావు పేర్కొన్నారు. ఎ.రమణారావు, పేరం రవీంద్రనాథ్, కె.జగదీశ్వరి, పీబీవీ ఎస్‌ఎన్ రాజులతో ఏర్పాటైన శాప్ అకాడమీస్ కమి టీ సోమవారం కాకినాడ జిల్లా ప్రాధికార సంస్థ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించింది. క్రీడా అకాడమీల
త్వరలో పునఃప్రారంభానికి చర్యలు
కాకినాడలో పర్యటించిన ‘శాప్’ కమిటీ సభ్యులు
కార్పొరేషన్ (కాకినాడ), సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ క్రీడా అకాడమీలను త్వరలో పునఃప్రారంభించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చర్యలు చేపట్టిందని బోర్డు సభ్యుడు, అకాడమీస్ కమిటీ సభ్యుడు ఎ.రమణారావు పేర్కొన్నారు. ఎ.రమణారావు, పేరం రవీంద్రనాథ్, కె.జగదీశ్వరి, పీబీవీ ఎస్‌ఎన్ రాజులతో ఏర్పాటైన శాప్ అకాడమీస్ కమి టీ సోమవారం కాకినాడ జిల్లా ప్రాధికార సంస్థ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించింది. క్రీడా అకాడమీల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న వసతులు, అదనంగా కావలసిన సౌకర్యాలను అధ్యయనం చేసింది. డీఎస్‌ఏ కార్యాలయంలో కమిటీ సభ్యులు మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి తమ పర్యటన వివరాలను తెలియజేశారు. కమిటీ సభ్యుడు రమణారావు మాట్లాడుతూ కొవిడ్ సంక్షోభం, నిధుల కొరత కారణం గా రాష్ట్రంలో క్రీడా అకాడమీలు 2019లో మూతపడ్డాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల ప్రోత్సాహానికి అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా క్రీడా అకాడమీలను పునరుద్ధరిం చేందుకు శాప్ చర్యలు చేపట్టిందన్నారు. ఇందు లో భాగంగా విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, తిరుపతి డీఎస్‌ఏల్లో అకాడమీల పునఃప్రారంభా నికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులను, ఇంకా కావలసిన సౌకర్యాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. ఏఏ క్రీడా అకాడమీలను ఎక్కడ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉంటుందనే అంశాలపై తమ కమిటీ శాప్‌కు నివేదిక సమర్పించనుందన్నారు. వివిధ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మెరుగైన క్రీడా శిక్షణ కల్పించేందుకు వంద మంది కోచ్‌ల నియామకానికి ‘శాప్’ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం కోరిందన్నారు. క్రీడా అకాడమీలను పునఃప్రారంభించేందుకు శాప్ చర్యలు తీసుకుంటుందని... 14 నుంచి 16 రకాల క్రీడాం శాలు ఈ అకాడమీల పరిధిలో ఉంటాయన్నారు. సుమారు 150 మంది క్రీడాకారులకు శిక్షణ కల్పించేందుకు అనువుగా ఇండోర్, ఔట్‌డోర్ క్రీడా వేదికలు, హాస్టళ్లు, కిచన్లు, డైనింగ్‌హాళ్లు వంటి అవసరమైన అన్ని వసతులను ఈ అకాడమీల్లో కల్పిస్తామన్నారు. కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అఽథారిటీ స్టేడియంలో దాదాపు అన్ని క్రీడ ల శిక్షణకు తగిన వసతులు ఉన్నాయని డార్మిటరీ నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం, కోచ్‌ల నియామకం వంటి అంశాలను తమ పరిశీలనలో గుర్తించామన్నారు. వీటిపై శాప్‌కు నివేదిక సమర్పిస్తుందన్నారు. డీఎస్‌ఏ సిబ్బంది వేతనాల కుది ంపు, పెండింగు బకాయిల చెల్లింపు సమస్యలపై వినతిపత్రం కమిటీకి సమర్పించగా శాప్‌కు తెలియజేస్తామన్నారు. అలాగే పే అండ్ ప్లే విధానాన్ని రద్దు చేసి పేద క్రీడాకారులకు శిక్షణా వసతులను అందుబాటులోకి తెస్తామని కమిటీ స భ్యులు వివరించారు. జిల్లా క్రీడా మైదానంలోని వివిధ క్రీడా విభాగాల పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. డీఎస్డీవో శ్రీనివాసరావు, డీఎస్‌ఏ కార్యాలయ సిబ్బంది, ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు.