Share News

హ్యాఫ్రీగా!

ABN , Publish Date - Aug 17 , 2025 | 01:11 AM

రాష్ట్రప్రభుత్వం శుక్రవారం నుంచి ప్రారంభిం చిన ఉచిత బస్సు ప్రయాణం పథకానికి అనూ హ్య స్పందన లభిస్తోంది. మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తూ ఉబ్బితబ్బిబ్బవుతున్నా రు.

హ్యాఫ్రీగా!
రాజమహేంద్రవరం డిపోవద్ద మహిళల ఆనందం

(కాకినాడ/రాజమహేంద్రవరం,ఆంధ్రజ్యోతి)

రాష్ట్రప్రభుత్వం శుక్రవారం నుంచి ప్రారంభిం చిన ఉచిత బస్సు ప్రయాణం పథకానికి అనూ హ్య స్పందన లభిస్తోంది. మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తూ ఉబ్బితబ్బిబ్బవుతున్నా రు. కేవలం ఆధార్‌ చూపించి జీరో ఫేర్‌ టికెట్‌తో ప్రయాణించడం సరికొత్తగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చడంతో మహిళలు నీరాజనం పడుతున్నారు. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం కింద తొలిరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8,283 మంది మహి ళలు ఉచితంగా ఐదు రకాల ఫ్రీబస్సుల్లో ప్ర యాణించారు. అది కూడా శుక్రవారం సాయం త్రం నుంచి రాత్రి 12 గంటల్లోపు. అంటే కేవలం తొలిరోజు కేవలం ఏడు గంటల వ్యవధిలో 8,283 మంది రికార్డుస్థాయిలో ఉచిత బస్సు ప్రయా ణాన్ని వినియోగించుకోవడం విశేషం. రెండో రోజైన శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 36 వేల మంది వరకు ఫ్రీగా ప్రయాణించారు. ప్రస్తుతం వరుస సెలవులు కావడంతో ఉచిత బస్సు ప్రయాణానికి రద్దీ అంతంతమాత్రంగానే ఉంది. సోమవారం నుంచి లక్షల్లో ప్రయాణి స్తారని అధికారులు అంచనా వేశారు.

సూపర్‌హిట్‌ పథకం..

సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా టీడీపీ ఇచ్చి న ఉచిత బస్సు పథకం శుక్రవారం నుంచి అమల్లోకి రావడంతో మహిళాలోకం సంబరాలు చేసుకుంటోంది. మహిళలు తమ ఆధార్‌కార్డులు చూపించగా గమ్యస్థానం ఆధారంగా టికెట్‌ ఛార్జీని ప్రస్తావిస్తూ కండక్టర్లు జీరోఫేర్‌ టికెట్‌ అందించారు. తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు డిపోల పరిధిలో 2,345 మంది మహి ళలు ఉచితంగా ప్రయాణించారు.అత్య ధికంగా రాజ మహేంద్రవరం డిపోలో ఉన్నారు. రెండో రోజైన శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36 వేల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించినట్టు అధికారులు అంచనా వేశారు. ప్రతిరోజు అర్ధ రాత్రి 12 దాటిన తర్వాత ఆ రోజు మొత్తం జీరోఫేర్‌ టికెట్లు ఎన్ని జారీ చేశారో లెక్కించి తద్వారా ఆ రోజు ఫ్రీ బస్సు ప్రయాణాలెన్ని అనే ది అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపు తున్నారు. ప్రస్తుతం సెలవులు ఉన్న నేప థ్యం లో ఫ్రీ బస్సు ప్రయాణాలకు రద్దీ భారీ స్థాయి లో ఉండడం లేదని..దీంతో ఆర్టీసీ సిబ్బం దికి కొంత ఉపశమనం కలిగినట్టు అధికారులు చెబు తున్నారు.సోమవారం నుంచి ఉచితబస్సు ప్ర యాణం చేసే మహిళలు భారీ స్థాయిలో పెరు గుతారని అంచనా వేస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచి సరాసరి రోజుకు 1.90 లక్షల మందికిపైనే మహిళలు ఉచిత బస్సు ప్రయా ణం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

తూర్పున 283 బస్‌లు

మహిళలు హ్యాఫ్రీగా ప్రయాణిస్తున్నారు.. టిక్కెట్‌ ఊసులేకపోవడంతో ఆనందంగా బస్‌లు ఎక్కుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 99 బస్సు రూట్లు ఉన్నాయి. అందులో 72 రూట్ల లో ఉచిత ప్రయాణం అనుమతించారు. సూపర్‌లగ్జరీ, ఇంద్ర తదితర బస్సులు తిరిగే 23 రూట్లలో మాత్రం ఉచిత ప్రయాణం అనుమ తించ లేదు. జిల్లాలో మొత్తం 283 బస్సులు ఉండగా 223 బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. రెండో రోజు సుమారు 95 శాతం మహిళలు ప్రయాణం చేశారు. సాధారణ ప్రయాణికులతో పాటు ప్రైవేట్‌, ప్రభుత్వ శాఖ ల్లో పనిచేసే మహిళా ఉద్యోగినులు సంబర పడుతున్నారు. రూట్ల సంఖ్యను పెంచడంతో పాటు సమయపాలన పాటించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.బస్‌ సౌకర్యం లేని గ్రామాలకు బస్సులు పునరుద్ధరించాలని ప్రజ లు కోరుతున్నారు. రాజమండ్రి షెల్టాన్‌ సెంటర్‌ వద్ద బస్సు పాయింట్‌ సరి చేయాలని పలు వురు మహిళలు తెలిపారు. రాజమహేంద్రవరం నుంచి అమలాపురం రూట్‌లో ఎక్స్‌ప్రెస్‌లు అధి కం.రాజమహేంద్రవరం, రావులపాలెం, కొత్త పేట తర్వాత అమలాపురంలో మాత్రమే ఆగు తాయి. ఇక్కడ టికెట్‌ రూ.75.పల్లె వెలుగు బస్సు లకంటే వేగంగా వెళతాయి.అందువల్ల ఈ రూట్‌ మహిళా ప్రయాణికులు ఉచితంగా వేగంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ఉద్యోగులు రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు నాన్‌ స్టాఫ్‌లో వెళతారు.కానీ నాన్‌ స్టాఫ్‌కు ఉచితం వర్తించదు. తుని, అన్నవరం రూట్లలో పల్లెవెలుగు, అలా్ట్ర పల్లెవెలుగు బస్సు లు బాగా ఉపయోగపడుతున్నాయి. సోమవా రం నుంచి ప్రయాణికులు పెరుగుతారు.

విద్యార్థినులకు ఊరట..

కాలేజీలకు వెళ్లే విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలకొకసారి రూ.605 చెల్లించి ఆర్టీసీ నుంచి బస్‌ పాస్‌లు తీసుకునే వార మని.. ఉచిత బస్సు ప్రయాణ నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరిందని వేమగిరికి చెందిన విద్యార్థినులు నిహారిక, రేష్మ, సంధ్య, ధవళేశ్వ రానికి చెందిన సాహితీ తెలిపారు. తూర్పుగోనగూడెంకు చెందిన తోట సత్యవతి, కండిక బుల్లెమ్మ, టి.వెంకటలక్ష్మి మాట్లాడు తూ తాము నెలకోసారి ఇస్కాన్‌ టెంపుల్‌కు వస్తామని,బస్సు టికెట్‌ రూ.30 ఉందని, ఆటో రూ.40 తీసుకునేవారని చెప్పారు. ఇవాళ ఉచి తంగా ప్రయాణించామని, చాలా సంతో షం గా ఉందన్నారు. కొందరు ఉద్యోగులు మాత్రం నెలకు రూ.3 నుంచి రూ.4 వేలు ఖర్చు అయ్యేదని..అది ఇవాళ మిగిలినట్టేనని ఆయా ఉద్యోగులు చెప్పడం గమనార్హం.

గుర్తింపుకార్డుల్లేక..

రాజోలు నుంచి రాజమహేంద్రవరంవచ్చిన ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఉచిత ప్రయా ణం చేశారని ఒక కండక్టర్‌ తెలిపారు. 10 మంది గుర్తింపు కార్డుల్లేక టికెట్లు తీసుకున్నా రని.. వారికి తాము ఉచిత ప్రయాణం గురించి వివరించామన్నా రు.ఇటువంటి పరిస్థితి అన్ని రూట్లలో కనిపించింది.

వాడపల్లి స్పెషల్‌కు.. ‘నో ఫ్రీ’..

వాడపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే ప్రత్యేక బస్సుల్లో నో ఫ్రీ. జిల్లా వ్యాప్తంగా వాడపల్లికి 22 బస్సు సర్వీసులు వివిధ డిపోల నుంచి నడుపుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 90 బస్సులు వస్తుంటాయి. ఈ బస్సు సర్వీసులన్నింటినీ ప్రత్యేక సర్వీసులుగా పరిగణిస్తూ ఆదేశాలు రావడంతో శనివారం తెల్లవారుజామునే డిపోలకు చేరుకున్న మహిళా భక్తులకు ఆర్టీసీ షాక్‌ ఇచ్చింది. స్పెషల్‌ సర్వీసులకు టిక్కెట్లు తీసుకోవాలని చెప్పడంతో ప్రయాణికులంతా అవాక్కయ్యారు. వాడపల్లి ఆలయానికి వచ్చిన ఆర్టీసీ ప్రత్యేక సర్వీసుల ముందు స్ర్తీశక్తి పథకం వర్తించదని బోర్డులు పెట్టారు. వాడపల్లి ఆలయానికి వెళ్లే మహిళా భక్తులకు ప్రభుత్వం ఫ్రీ సర్వీసు వర్తింప చేసేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మహిళా భక్తులు కోరుతున్నారు.

గుర్తింపుకార్డు జిరాక్స్‌ ఉన్నా ఓకే : వైఎస్‌ఎన్‌

రాజమహేంద్రవరం అర్బన్‌,ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లా లో రోజూ సుమారు 32వేల మంది ప్రయాణిస్తుం టారని, అం దులో మహిళలే అధికంగా ఉంటారని ఆర్టీసీ జిల్లా అఽధికారి ఏలూరి సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఆధార్‌, ఓటరు, రేషన్‌ కార్డులను నేరుగా తేలేకపోయినా డిజిటల్‌, జిరాక్స్‌లు చూపిం చినా అనుమతిస్తామన్నారు. టిక్కెట్లు జారీ చేసే టిమ్స్‌ మెషీన్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉమెన్‌ ఫ్రీ టికెట్‌ (డబ్ల్యుఎఫ్‌టీ) బటన్‌పై సిబ్బందికి శనివారం ప్రత్యేక అవగాహన కల్పించారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టిక్కెట్లు జారీ చేసే కండక్టర్‌, డ్రైవర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు.

Updated Date - Aug 17 , 2025 | 01:11 AM