ఏలూరులో లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:04 AM
ఏలూరు క్రైం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరు సమీపంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగి 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాకి నాడ నుంచి గుంటూరుకు మంగళవారం అర్ధ రాత్రి ఆర్టీసీ బస్సు బయలుదేరింది. బుధవారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో ఏలూరు మెయిన్ బైపాస్ రామచంద్ర ఇంజనీ రింగ్ కాలేజీ వద్ద ఆయిల్ డబ్బాల లారీని వెనుక నుంచి బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. వారిలో నలు గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ముగ్గురికి పళ్లు ఊడిపోయాయి. ప్రమాద సమాచారం అం

12 మందికి తీవ్ర గాయాలు
క్షతగాత్రుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావాసులు
ఏలూరు క్రైం, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరు సమీపంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగి 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాకి నాడ నుంచి గుంటూరుకు మంగళవారం అర్ధ రాత్రి ఆర్టీసీ బస్సు బయలుదేరింది. బుధవారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో ఏలూరు మెయిన్ బైపాస్ రామచంద్ర ఇంజనీ రింగ్ కాలేజీ వద్ద ఆయిల్ డబ్బాల లారీని వెనుక నుంచి బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. వారిలో నలు గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ముగ్గురికి పళ్లు ఊడిపోయాయి. ప్రమాద సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు ఏలూరు 108 అంబులెన్సు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తర లించారు. క్షతగాత్రులు ఇట్టి సత్యసాయి (కాకి నాడ), కర్రి హారిక (రావుల పాలెం), వెల్ల రాజు (మాచవరం), కడియం రామశివుడు (కాకి నాడ), కొర్ల సుబ్రహ్మణ్యం (కాకినాడ), కొత్తల వెంకట లక్ష్మి(రామచంద్రపురం), కఠారి శిరీష్ (కాకినాడ), ఆరేపల్లి సాయిదుర్గ ప్రసాద్ (తణు కు), వడిత దత్తు నాయక్ (మాచర్ల), జిగిలింగ పవన్‌కుమార్ (కాకినాడ), ఆకుల శేషు (కడియ పులంక), రూపేంద్ర గాంధీలు తీవ్రంగా గాయ పడ్డారు. క్షతగాత్రులను ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, త్రీటౌన్ సీఐ వి.కోటేశ్వరరావు, ఎస్‌ఐ రాంబాబు పరామర్శించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీలోని 2 ఆయిల్ డబ్బాలు పగిలిపోవడంతో ఆ ప్రాంత మంతా ఆయిల్ పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసు లు చర్యలు చేపట్టారు. క్రేన్లతో లారీ, బస్సును రోడ్డు పక్కకు తీయించి వాహనాల రాకపో కల కు అంతరాయంలేకుండా చర్యలు తీసుకున్నారు.
బాధితులకు సాయం అందించే ప్రయత్నం
కార్పొరేషన్ (కాకినాడ), మార్చి 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడ ఆర్టీసీ డిపో నుంచి మంగళవారం రాత్రి 12:55కి గుంటూరు బయలుదేరిన సూపర్‌లగ్జరీ బస్ ఏలూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ బస్సులో మొత్తం 26మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 12మందికి తీవ్ర గాయాలు కాగా ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారికి ఆర్టీసీ అధికారులు చికిత్స నిమిత్తం రూ.5వేలు ఇవ్వడానికి ప్ర యత్నించినా కొంతమంది తిరస్కరించి అవసరంలేదని చెప్పి వెళ్లిపోయినట్టు కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు.