అంతరాన్ని తగ్గించడమే పీ4 లక్ష్యం : కలెక్టర్
ABN , Publish Date - Aug 01 , 2025 | 01:34 AM
మార్గదర్శి, బంగారు కుటుంబాల మధ్య అనుబంధం దీర్ఘకాలం ఉండాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. ధనికులు, పేదల మధ్య అంతరం తగ్గించడమే పీ4 కార్యక్రమం లక్ష్యం అని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లాల కలెక్టర్లతో అన్నదాత సుఖీభవ, పీ4 సానుకూల అభిప్రాయ సర్వే, నీటివనరుల పునరుద్ధరణ పథకాలపై గురు వారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు.
అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యతపై అసంతృప్తి.. అధికారులు దృష్టి పెట్టాలి
రాజమహేంద్రవరం రూరల్, జూలై 31 (ఆం ధ్రజ్యోతి): మార్గదర్శి, బంగారు కుటుంబాల మధ్య అనుబంధం దీర్ఘకాలం ఉండాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. ధనికులు, పేదల మధ్య అంతరం తగ్గించడమే పీ4 కార్యక్రమం లక్ష్యం అని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జిల్లాల కలెక్టర్లతో అన్నదాత సుఖీభవ, పీ4 సానుకూల అభిప్రాయ సర్వే, నీటివనరుల పునరుద్ధరణ పథకాలపై గురు వారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లా అధికారులకు కలెక్టర్ ప్రశాంతి పలు సూచనలు చేశారు. పీ4 మార్గధర్శకులగా ఉండమని ఎవ్వరినీ ఒత్తిడి చేయరాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మార్గ దర్శకులుగా ఉండడానికి ఆసక్తి కనబరిస్తే ఆహ్వానించాలన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా మార్గదర్శకులు, బంగారు కుటుంబాల ఎంపి కను గడువులోగా పూర్తిచేయాలన్నారు. సాను కూల ప్రజాభిప్రాయ సర్వేలో సకాలంలో చెత్త తొలగింపుపై సానుకూల అభిప్రాయం వ్యక్త మైందని తెలిపారు. అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత కొంత అసంతృప్తి ఉందని, దీనిపై సంబంధిత అధికారులు దృష్టిసారించా లన్నా రు. మహిళలపై నేరాలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని, దీనికి తగిన ప్రచారం ఇవ్వాలని సూచించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టాలన్నది సీఎం ఆలోచన కాగా, దీనికి అను గుణంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నా రు. కాలువలు సక్రమంగా ఉన్నాయా, వాటి ద్వారా చెరువులు నిండుతున్నాయా అనే అంశా లను పరిశీలించాలన్నారు. సాగునీటి, మంచి నీటి చెరువుల పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న ఆర్‌ఆర్‌ఆర్ పథకానికి ప్రతిపాదనలు సిద్ధంచే యాలని అధికారులను ఆదేశించారు. కొవ్వూరు, నిడదవోలులో ఉన్న పురపాలక సమస్యలపై దృష్టి సారిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జేసీ చిన్నరాముడు, డీఆర్వో సీతారామమూర్తి, ముఖ్య ప్రణాళిక అధికారి అప్పలకొండ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
నందరాడ, నరేంద్రపురం రైతు సేవా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ
రాజానగరం, జూలై 31(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. పీఎం కిసాన్ యోజన, అన్న దాత సుఖీభవ పథకం అమలుతీరు పరిశీలనలో భాగంగా రాజానగరం మండలం లోని నందరాడ, నరేంద్రపురం రైతు సేవా కేంద్రాలను అధికారులతో కలిసి గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే రికార్డులు నిర్వహణ, డాటా ఎంట్రీ, ఇతర అనుబంఽధ కార్యకలాపాల తీరుపై కలెక్టర్ సమీక్షించారు. రైతులకు ప్రభుత్వం అంది స్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి సమర్థవంతంగా చేరాలంటే, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న రెవెన్యూ, వ్యవసాయశాఖ సిబ్బంది కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నందరాడ వీఆర్వో సీహెచ్ ముని తిరుపతి, దివాన్‌చెరువు-3కు చెందిన వీఆర్వో ఎం.సత్యనారాయణ (నరేంద్రపురం ఇన్ చార్జ్) తీరుపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. తక్షణమే వారిని కలెక్టరేట్‌కు అటాచ్‌మెంట్ చేయాలని తహశీల్దార్ జి.అనంతలక్ష్మి సత్యవతిదేవిని ఆదేశించారు.