Share News

అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి.. వృద్ధురాలిని కొట్టి..

ABN , Publish Date - Sep 26 , 2025 | 12:37 AM

నల్లజర్ల, సెప్టెంబరు 25 (ఆంధ్ర జ్యోతి): తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంటి తలుపులు పగల గొట్టి ప్రవేశించి నిద్రిస్తున్న ఒంటరి వృద్ధురాలిపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవిదిద్దు లు, బీరువాలో ఉన్న 4 గాజులు మొ త్తం 15 కాసుల బంగారుం, రూ.50 వేల నగదు దోచుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లజర్ల సెంటర్‌లో వృ ద్ధురాలు పాకలపాటి సుభధ్ర ఒంటరిగా నివాసం ఉంటుంది. కుమారుడు ర

అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి.. వృద్ధురాలిని కొట్టి..
బీరువాలోని దుస్తులను చెల్లాచెదురుగా పడేసిన దొంగలు

15 కాసుల బంగారం, రూ.50వేల నగదు దోచుకున్న నలుగురు దుండగులు

రెండు మోటార్‌సైకిళ్లను సైతం దొంగిలించి వాటిపై పరారీ

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఘటన

నల్లజర్ల, సెప్టెంబరు 25 (ఆంధ్ర జ్యోతి): తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంటి తలుపులు పగల గొట్టి ప్రవేశించి నిద్రిస్తున్న ఒంటరి వృద్ధురాలిపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవిదిద్దు లు, బీరువాలో ఉన్న 4 గాజులు మొ త్తం 15 కాసుల బంగారుం, రూ.50 వేల నగదు దోచుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లజర్ల సెంటర్‌లో వృ ద్ధురాలు పాకలపాటి సుభధ్ర ఒంటరిగా నివాసం ఉంటుంది. కుమారుడు రమేష్‌ తల్లికి పగలు సేవలందించి రాత్రి అదే గ్రామంలోని అత్తగారింటికి వెళ్లి నిద్రి స్తాడు. ఇది గమనించిన దుండగులు బుధవారం అర్ధరాత్రి 1.30 గంటలకు నలుగురి ముసుగులు ధరించి ముం దుగా ఇంటి తలుపుకొట్టారు. తీయకపోవ డంతో పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవిదిద్దులు తీసుకుని బీరువా తాళాలు ఎక్కడున్నాయని ఆమెపై రాళ్లతో దాడి చేశారు. ఆమె గాయాలు భరించలేక బీరువా తాళాలు ఇచ్చేసింది. బీరువాలో ఉన్న 4బంగారు గాజులు, రూ.50 వేల నగదు దోచుకున్నారు. భయంతో వృద్ధు రాలు బిగ్గరగా కేకలు వేయడంతో దొంగ లు ఆమె సెల్‌ఫోన్‌ తీసుకుని గోడ దూకి పక్కిం ట్లోని రెండు మోటార్‌సైకిళ్లను సైతం దోచుకుని వాటిపై పారిపోయారు. తర్వాత తేరుకున్న సుభధ్ర సెంటర్‌కు పరిగెత్తుకుంటూ వెళ్లి మరొకరి సెల్‌ ఫోన్‌ తీసుకుని కుమారుడు రమేష్‌కు ఫోన్‌ చేయడంతో అతడు వచ్చి పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన జరిగిన ప్రదేశానికి వచ్చి కొవ్వూరు డీఎస్పీ దేవ కుమార్‌, దేవరపల్లి సీఐ నాయక్‌ పరిశీలించారు. రాజమహేంద్ర వరం నుంచి క్లూస్‌ టీం వచ్చి వేలిముద్రలు సేకరిం చారు. కేసు నమోదు చేశామని, నిందితులను త్వరలో పట్టుకుం టామని డీఎస్పీ దేవకుమార్‌ తెలిపారు. సుభధ్ర ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో దుండగులు వచ్చిన దృశ్యాలు కనిపిస్తున్నాయని, వారి కోసం నాలుగు బృం దాలు ముమ్మరంగా గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 12:37 AM