Share News

కొవ్వాడలో పట్టపగలే చోరీ

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:37 AM

కాకినాడ రూరల్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం కొవ్వాడలోని ప్రధాన కూడలి సమీపంలోని ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. సుమారు 50 కాసుల బంగారం అపహరణకు గురైంది. ఇంద్ర పాలెం ఎస్‌ఐ ఎం.వీరబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ఇంటి యజమాని మక్కా చి న్నా

కొవ్వాడలో పట్టపగలే చోరీ
చోరీ జరిగిన ఇంట్లో బీరువాను పరిశీలిస్తున్న రూరల్‌ సీఐ డీఎస్‌ చైతన్యకృష్ణ, ఎస్‌ఐ

50 కాసుల బంగారం అపహరణ

కాకినాడ రూరల్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం కొవ్వాడలోని ప్రధాన కూడలి సమీపంలోని ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. సుమారు 50 కాసుల బంగారం అపహరణకు గురైంది. ఇంద్ర పాలెం ఎస్‌ఐ ఎం.వీరబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ఇంటి యజమాని మక్కా చి న్నారావు కిర్లంపూడి ఎంఈవోగా, ఆయన భార్య మాధవపట్నం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల తర్వాత దంపతులిద్దరూ ఇంటి గేటుకి, ప్రధాన ద్వారానికి తాళాలు వేసుకుని ఉద్యోగాలకు వెళ్లారు. సాయంత్రం 5గంటలకు చిన్నారావు ఇంటికి వచ్చి చూసేసరికి తాళా లు బద్దలుగొట్టి తలుపులు తెరిచి ఉండడంతో కంగారుపడి చోరీ జరిగినట్టు ఇంద్రపాలెం పోలీసులకు సమాచారమిచ్చారు. కాకినాడ రూరల్‌ సీఐ డీఎస్‌ చైతన్యకృష్ణ, క్లూస్‌ టీం చోరీ జరిగిన ఇంటిని పరిశీలించింది. చిన్నారావు ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Oct 08 , 2025 | 12:37 AM