దొంగల ముఠా ఆటకట్టు
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:48 AM
రాజమహేంద్రవరం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఎలాగైనా దోపిడీ చేయడమే వారి లక్ష్యం. గ్యాంగ్‌గా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. వాకిట్లో కల్లాపు వేస్తున్న మహిళల మెడలోని ఆభరణాలు సైతం లాగే స్తారు. అద్దెకు తీసుకున్న కారులో తిరుగుతూ గేటుకు తాళం వేసి ఉన్న ఇళ్లపై పగలు రెక్కీ చేస్తారు. రాత్రి క
నలుగురి అరెస్ట్
రూ.45 లక్షల చోరీ సొత్తు స్వాధీనం
సీఐ బృందానికి రూ.50 వేల రివార్డు
వివరాలు వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ
రాజమహేంద్రవరం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఎలాగైనా దోపిడీ చేయడమే వారి లక్ష్యం. గ్యాంగ్‌గా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. వాకిట్లో కల్లాపు వేస్తున్న మహిళల మెడలోని ఆభరణాలు సైతం లాగే స్తారు. అద్దెకు తీసుకున్న కారులో తిరుగుతూ గేటుకు తాళం వేసి ఉన్న ఇళ్లపై పగలు రెక్కీ చేస్తారు. రాత్రి కన్నం వేస్తారు. మంచాలు, టీవీలను కూడా పట్టుకు పోతారు. చోరీ సొత్తును తాకట్టు పెట్టి లేదా అమ్మేసి ఆ డబ్బుతో విలాసాలు చేస్తారు. అలాంటి నలుగురి ఆట కట్టించారు పోలీసులు. రూ.45 లక్షల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఈ వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు.
అసలేం జరిగిందంటే...
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు పంచాయతీ భవానీపురానికి చెందిన గరిమెళ్ల పవన్‌శర్మ కుటుంబంతో గత నెల 15న శ్రీశైలం వెళ్లారు. 20న తిరిగి వచ్చేసరికి ఇంటి గేటు, తలుపు, బీరువా తా ళాలు బద్దలు కొట్టి ఉన్నాయి. 18 కాసుల బం గారు ఆభరణాలు, 3.50 కిలోల వెండి వస్తువులు దోపిడీకి గురయ్యాయి. శర్మ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై ఎస్పీ నరసింహ కిషోర్ సీరియస్‌గా దృష్టి పెట్టారు. నార్త్‌జోన్ డీఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షణలో రాజానగరం సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ ఆధ్వ ర్యంలో 10మందితో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు 15 రోజులు శ్రమించి చివరికి దొంగతో పాటు గ్యాంగ్‌ని కటకటాల్లోకి నెట్టారు. దర్యాప్తులో కొంతమూరు సంతోష్‌నగర్‌కు చెందిన వేమగిరి హరీశ్ గ్యాంగ్ ఆ దొంగతనం చేసినట్టు గుర్తించారు. దర్యాప్తు ముమ్మరం చేసి కచ్చితమైన సమాచారంతో హరీశ్, అదే ప్రాంతానికి చెందిన మోర్త వెంకటేశ్ (వెంకీ), ఇంద్రపాలెనికి చెందిన తణుకు దర్గాప్ర సాద్(సూర్య), తొర్రేడు టిడ్కో గృహ సముదా యానికి చెందిన బండి ధర్మరాజు(గాబ్రియెల్)ను సీఐ వీరయ్య గౌడ్ బృందం అరెస్టు చేసిందని సోమ వారం ఎస్పీ తెలిపారు. ఈ కేసులో అశో క్, రాజేశ్‌ని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి చోరీ సొత్తు 301 గ్రాముల బంగారు ఆభరణాలు, 7కి లోల వెండి వస్తువులు, రూ.5 లక్షల నగదు, కారు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కంచు సామగ్రి, టీవీలు, మంచాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇంకా సుమారు 150గ్రాముల బంగారు వస్తువులను రికవరీ చేయాల్సి ఉందన్నారు.
వయసు 34 కేసులు 40..
నిందితుల్లో హరీశ్ వయసు 34 కాగా 40 కేసులు, వెంకటేష్ (36)పై 34, దుర్గాప్రసాద్ (25)పై ఏడు, ధర్మరాజు(29)పై ఏడు కేసులు ఉన్నాయన్నారు. వీళ్లకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఎ స్పీ తెలిపారు. దొంగల ముఠా ను చాకచక్యంగా అరెస్టు చేసి భారీగా చోరీ సొత్తును రికవరీ చేసిన సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్‌ఐలు ప్రియకుమార్, ఏకే సత్యనారాయణ, నాగార్జున, క్రైం సిబ్బంది అమ్మిరాజు, సత్యనారాయణ, కరీం, బీవీ రమణ, సురేశ్, మురళీని ఎస్పీ అభినందించి రూ.50వేల ప్రత్యేక రివార్డును అందజేశారు.