Share News

వయసు 20.. దొంగతనాలు 35

ABN , Publish Date - May 01 , 2025 | 12:45 AM

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): 20 ఏళ్ల వయస్సులో 35 దొంగతనాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న దొంగను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వన్‌టౌన్‌ పోలీసులు పట్టేశారు. విశాఖపట్నం నుం చి ఎన్టీఆర్‌ జిల్లా వరకు ఇళ్ల దొంగతనాలు, బైక్‌ దొంగతనాల్లో ఆరితేరిన దొంగను పట్టేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డేగాపురానికి చెందిన జువ్వల కుమార్‌ రాజా అలియాస్‌ తరుణ్‌కుమార్‌, బేతా దుర్గాప్రసా

వయసు 20.. దొంగతనాలు 35
నిందితుడు, బైక్‌లతో పోలీసులు

తప్పించుకుని తిరుగుతూ పట్టుపడిన దొంగ

ఐదు బైక్‌లు స్వాధీనం

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): 20 ఏళ్ల వయస్సులో 35 దొంగతనాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న దొంగను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వన్‌టౌన్‌ పోలీసులు పట్టేశారు. విశాఖపట్నం నుం చి ఎన్టీఆర్‌ జిల్లా వరకు ఇళ్ల దొంగతనాలు, బైక్‌ దొంగతనాల్లో ఆరితేరిన దొంగను పట్టేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డేగాపురానికి చెందిన జువ్వల కుమార్‌ రాజా అలియాస్‌ తరుణ్‌కుమార్‌, బేతా దుర్గాప్రసాద్‌, మామిడి దుర్గారావు ముగ్గురు కలిసి 2023లో విశాఖజిల్లా గోపాలపట్నంలో ఒక ఇంటి తాళాన్ని పగులగొట్టి దొంగతనం చేశారు అటుపై భీమవరం చిన్నఅమిరంలో బైక్‌, ఎనీ ్టఆర్‌ జిల్లా పటమటలో బైక్‌, రాజమహేంద్రవ రం టూటౌన్‌లో రెండు బైక్‌లు, వీరపల్లిలో బైక్‌, ఉండిలో బైక్‌, బొమ్మూరు పరిధిలో బైక్‌ను తరు ణ్‌, మారుబోయిన మావుళ్లు అనే దొంగతో కలిసి అపహరించుకుపోయారు. ఇందులో మా వుళ్లును గత నెల 23న అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని టూటౌన్‌ పోలీసులు తెలిపారు. అయితే బుధవారం టూటౌన్‌ సీఐ పి.శివగణేష్‌ ఆధ్వర్యంలో క్రైమ్‌ పార్టీ ప్రత్యేక నిఘాపెట్టి ఐదు బళ్ల మార్కెట్‌ సమీపంలో రైల్వే క్వార్టర్స్‌ వద్ద తరుణ్‌కుమార్‌ను పట్టుకున్నారు. నిందితుడి నుంచి ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించారు. తరుణ్‌ను చాకచక్యంగా పట్టుకున్న సీఐ శివగణేష్‌, హెచ్‌సీ ఎస్‌.రాజశేఖర్‌, క్రైమ్‌ కానిస్టేబుల్‌ ఎస్‌కే రబ్బాని, కానిస్టేబుల్స్‌ను తూర్పుగోదావరి ఎస్పీ నరసింహకిషోర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Updated Date - May 01 , 2025 | 12:45 AM