ఇద్దరు దొంగలు.. 97 చోరీలు..
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:32 AM
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 27(ఆంధ్ర జ్యోతి): బొమ్మూరు పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగల ఆటకట్టించారు. ఈస్ట్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదా వరి జిల్లా దివాన్‌చెరువు ఫ్రూట్ మార్కెట్ సమీ పంలో నివాసం ఉంటున్న క్యానం అన్వేష్ కుటుం బంతో తల్లి అస్తికలు కాశీలో కలపడానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి బెడ్‌రూం చిందరవం దరగా ఉంది. బంగారం వస్తువులు, నగదు కనిపించలేదు. దీనిపై బొమ్మూరు పోలీసులకు ఫిర్యా
అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకున్న బొమ్మూరు పోలీసులు
రూ.9.98 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 27(ఆంధ్ర జ్యోతి): బొమ్మూరు పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగల ఆటకట్టించారు. ఈస్ట్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదా వరి జిల్లా దివాన్‌చెరువు ఫ్రూట్ మార్కెట్ సమీ పంలో నివాసం ఉంటున్న క్యానం అన్వేష్ కుటుం బంతో తల్లి అస్తికలు కాశీలో కలపడానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేసరికి బెడ్‌రూం చిందరవం దరగా ఉంది. బంగారం వస్తువులు, నగదు కనిపించలేదు. దీనిపై బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాలతో డీఎస్పీ భవ్యకిషోర్ పర్యవేక్షణలో సీఐ కాశీ విశ్వనాథ్ తన బృందంతో దర్యాప్తు ప్రారం భించారు. ఇద్దరు వ్యక్తులు హౌసింగ్ బోర్డు కాల నీ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండ గా పట్టుకున్నారు. వాళ్లను ప్రశ్నించి ఇంటి దొంగత నాలకు పాల్పడుతున్నారని నిర్ధారించుకు న్నారు. దీంతో ఒడిశాలోని జాగ్మోరా భువనేశ్వర్‌కి చెందిన ప్రశాంత కుమార్ కరాడా, గంజాంకు చెందిన సాగర్ కుమార్ పాండాను అరెస్టు చేశామని డీఎస్పీ వివరించారు. ఈ ఇద్దరూ 2000వ సంవత్సరం నుంచి నేరాలు చేస్తు న్నారు. విశాఖ పట్నం ప్రాంతం లో 11, కాకినాడ 4, గుంటూరు 3, ఒడిశాలోని బరంపురం 5, బైద్యనాథ్ 4, బడా బజార్ 5, గుస్సాన్ 8, హైదరాబాద్‌లోని కూక ట్‌పల్లి 6, నాగ్‌పూర్ ప్రతాప్‌నగర్‌లో 10తో కలిపి సుమారు 97 కేసులు ఉన్నాయి’’ అని డీఎస్పీ తెలిపారు. ప్రశాంత్ కుమార్ కరుడుగట్టిన దొంగ అని, నాలుగేళ్ల నుంచి తప్పిం చుకొని తిరుగుతున్నాడని చెప్పా రు. కలకత్తాలో ఓ సారి కాల్పులు కూడా జరిపా డన్నారు. నిందితుల నుంచి రూ.9.98 లక్షల విలు వైన నగదు, నగలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. క్లిష్టమైన కేసును నెల రోజుల్లో పరిష్కరించడంలో ప్రతిభ చూపిన సీఐ కాశీ విశ్వనాథం, ఎస్‌ఐ మురళీ మోహన్, హెచ్‌సీలు వెంకటేశ్వరరావు, ప్రసాద్, వెంకట రమణ, పీసీ లు సురేశ్ బాబు, మనికంఠ, హరీశ్, పూర్ణిమా రాజ్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.