Share News

ముగ్గురు దొంగలు..17 కేసులు

ABN , Publish Date - Apr 28 , 2025 | 12:33 AM

అమలాపురం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): గత మూడేళ్లలో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డ ముగ్గురితో కూడిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ పరిధిలో కురసాలవారివీధిలో 2 ప్రాంతాల్లోను, గాంధీనగర్‌లో ఒకచోట దొంగతనాలకు

ముగ్గురు దొంగలు..17 కేసులు
అమలాపురంలో మాట్లాడుతున్న ఎస్పీ కృష్ణారావు, అడ్మిన్‌ ఎస్పీ ప్రసాద్‌, డీఎస్పీ ప్రసాద్‌

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

రూ.40లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు ,

6 సెల్‌ఫోన్లు స్వాధీనం

కోనసీమ జిల్లా ఎస్పీ వెల్లడి

అమలాపురం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): గత మూడేళ్లలో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డ ముగ్గురితో కూడిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ పరిధిలో కురసాలవారివీధిలో 2 ప్రాంతాల్లోను, గాంధీనగర్‌లో ఒకచోట దొంగతనాలకు పాల్పడ్డ ఈ అంతర్‌రాష్ట్ర ముగ్గురు సభ్యుల ముఠా నుంచి రూ.40లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులపై వివిధ జిల్లాల్లో మొత్తం 17 కేసులు ఉన్నాయి. ఈ వివరాలను అమలాపురం ఎస్పీ కార్యాలయ కాన్ఫరెన్సు హాలులో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు వెల్లడించారు.

జనవరి 11న అమలాపురంలోని కురసాలవారివీధిలో గల ఒక ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తలుపు బోల్టు తీసి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని బంగారం, నగదు దొంగిలించుకుపోయా రు. అప్పట్లో పట్టణ పోలీసుస్టేషన్‌లో నమోదైన ఈ కేసుకు సంబంధించి పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన జంగా వెంకట్రావు (33), అదే జిల్లాలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన దమ్ము సుధాకర్‌, గుంటూరు అర్బన్‌ జిల్లా శ్రీరామ్‌నగర్‌కు చెందిన కాట్ల కిశోర్‌బాబు (35)లు నర్సాపురంలో ఆభరణాలు విక్రయిస్తుండగా ఆదివారం అరె స్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు. వారి నుంచి 400 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు గతంలో కోనసీమలోని రావులపాలెం పోలీసుస్షేన్‌లో 1, అమలాపురం టౌన్‌ పోలీసుస్టేషన్‌లో 1, తూర్పుగోదావరిలో 2, ఏలూరులో 3, గుడివాడలో 1, నంద్యాల 2, కడక 1, కర్నూలు 1, అనంతపురం 1, పశ్చిమగోదావరి 1, అన్నమయ్య జిల్లా 1 కేసుల్లో గతంలోనే నిందితులుగా ఉన్నారు. అలాగే మిర్యాగూడాలో 15 కేసుల్లో, నంద్యాల జిల్లాలో 2 కేసుల్లోను ఇప్పటికే వారు అరెస్టు అయినట్టు ఎస్పీ చెప్పారు. ముగ్గురి నుంచి సుమారు రూ.40లక్షలు విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. విలేకర్ల సమావేశంలో అడ్మిన్‌ ఎస్పీ ప్రసాద్‌, డీఎస్పీ ప్రసాద్‌లు పాల్గొన్నారు. ఈ కేసు చేదించడంలో కీలకంగా పనిచేసిన సీఐలు వీరబాబు, గజేంద్ర ఎస్‌ఐ కిశోర్‌బాబు, క్రైమ్‌ ఏఎస్‌ఐ అయితాబత్తుల బాలకృష్ణ, పోలీసులకు ఎస్పీ రివార్డు, ప్రశంసాపత్రాలు అందించి వారిని అభినందించారు.

Updated Date - Apr 28 , 2025 | 12:33 AM