Share News

ఆలయాల్లో హుండీలే టార్గెట్‌

ABN , Publish Date - Jun 18 , 2025 | 12:21 AM

అనపర్తి, జూన్‌ 17 (ఆంరఽధజ్యోతి): హిందూ దేవాలయాల్లో హుండీలను టార్గెట్‌గా పెట్టుకుని చోరీలు చేస్తున్న వ్యక్తిని అనపర్తి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం అనపర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్‌ఐ శ్రీనునాయక్‌ వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రా జమహేంద్రవరం సోమాలమ్మ ఆలయ సమీపానికి చెందిన ప్రగడ నాగశివ ఈనెల 7వ తేదీన రాత్రి అనపర్తి మండలంలోని కుతుకులూరు,

ఆలయాల్లో హుండీలే టార్గెట్‌
అనపర్తి పోలీస్‌స్టేషన్‌లో నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌ఐ శ్రీనునాయక్‌

పలుచోట్ల 15 కేసులు

ఒకే రాత్రి 6 దేవాలయాల్లో చోరీలు

నిందితుడిని అరెస్టు చేసిన అనపర్తి పోలీసులు

అనపర్తి, జూన్‌ 17 (ఆంరఽధజ్యోతి): హిందూ దేవాలయాల్లో హుండీలను టార్గెట్‌గా పెట్టుకుని చోరీలు చేస్తున్న వ్యక్తిని అనపర్తి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం అనపర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్‌ఐ శ్రీనునాయక్‌ వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రా జమహేంద్రవరం సోమాలమ్మ ఆలయ సమీపానికి చెందిన ప్రగడ నాగశివ ఈనెల 7వ తేదీన రాత్రి అనపర్తి మండలంలోని కుతుకులూరు, పులగుర్త, పెడపర్తి గ్రామాల్లోని ఆరు ఆలయాల్లో హుండీలను పగులగొట్టి చోరీలు చేశాడు. దీనిని సవాల్‌గా తీసుకున్న అనపర్తి పోలీసులు నిందితుడి కోసం వెతుకులాట ప్రారంభించారు. కదలికలపై దృష్టిసారించిన పోలీసులు మంగళవారం అనపర్తి దేవీచౌక్‌ వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ విషయాలు బయటపడ్డాయి. నాగశివపై ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో 2, రావులపాలెంలో 2, లక్కవరం ఒక టి, కొవ్వూరు టౌన్‌లో ఒకటి, కడియంలో ఒకటి, దర్మాజిగూడెంలో 2, పి.గన్నవరంలో ఒకటి, మండపేటలో 2, అనపర్తిలో 2 కేసులు ఉన్నాయని ఎస్‌ఐ పేర్కొన్నారు. పెద్దగా సొమ్ము రికవరీ లేకపోయినా వరుస దొంగతనాలపై ఈ కేసును సీరియస్‌గా తీసుకుని నిందితుడిని అరె స్టు చేసి రిమాండుకు తరలించినట్టు తెలిపారు. ఈ కేసును చేధించేందుకు కృషిచేసిన కానిస్టేబుల్స్‌ తమ్మారావు, సత్యనారాయణ, వెంకట్రావు, నాగేంద్ర, రఘు, త్రిమూర్తులను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌, డీఎస్పీ విద్య, సీఐ సుమంత్‌ తదితరులు అభినందించారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్‌ఐ బి.దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 12:21 AM