దొంగలు దొరికారు..
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:01 AM
కాకినాడ క్రైం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పలు చోరీ కేసుల్లో 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.59.60 ల
వేర్వేరు చోరీ కేసుల్లో 12 మంది అరెస్ట్
రూ.59.60 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
వెల్లడించిన ఎస్పీ బిందుమాధవ్
కాకినాడ క్రైం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పలు చోరీ కేసుల్లో 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.59.60 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ జి.బిందుమాధవ్ ఈ వివరాలను వెల్లడించారు.
కేసుల వివరాలివి...
ఇటీవల రద్దీగా ఉండే బస్‌స్టాండ్‌లు, బస్‌స్టాప్‌లలో మహిళలే టార్గెట్‌గా హ్యాండ్‌బ్యాగ్‌లలోని విలువైన వస్తువులను అగంతకులు తస్కరిస్తుండడం పోలీసులకు చాలెంజ్‌గా మారింది. ఈ నే పథ్యంలో ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో పెద్దాపురం ఎస్‌డీపీవో డి.శ్రీహరిరాజు నేతృత్వంలో జగ్గంపేట సీఐ వైఆర్‌కె శ్రీనివాస్ పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టారు. తాడేపల్లిగూడెం, యాగరిప ల్లి కాలవగట్టుకు చెందిన పాత నేరస్తురాలు 27 ఏళ్ల గేరక వరలక్ష్మి... ఆమెకు సహకరించిన అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల మరసాని సత్యవేణిని అదుపులోకి తీసుకుని విచారించారు. వరలక్ష్మిపై గతంలో సఖినేటిపల్లిలో 2, నూజివీడులో 2, ఏలూరులో 1, తాళ్ళపూడిలో 1 పాత కేసులు ఉన్నట్టు ఎస్పీ వెల్లడించారు. వారి నుంచి జగ్గంపేట, తుని, గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో 4 కేసులకు సంబంధించిన 176 గ్రాములు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రత్తిపాడు మెయిన్ రోడ్డులోని సురేష్ జ్యూయలరీ షాపులో ఈ ఏడాది సెప్టెంబరు 24న అర్ధరాత్రి షాపు షట్టర్ పగలగొట్టి గు ర్తు తెలియని వ్యక్తులు సుమారు 11 కిలోల వెం డి వస్తువులను దొంగిలించుకునిపోయారు. దీని పై ప్రత్తిపాడు సీఐ బి.సూర్యఅప్పారావు పర్యవేక్షణలో ఎస్‌ఐ లక్ష్మికాంతం బృందాలతో దర్యాప్తు చేపట్టి మధ్యప్రదేశ్‌కు చెందిన డెకాయిట్ ముఠా సభ్యులైన షేక్ ఫక్రుద్దిన్ బిషనై, కేషూమెహదా, బారిక్‌సింగ్, రఘాన్ హాటియా, హీరు, మోహర్‌కల్లు మెహదాను అరెస్ట్ చేసి 11 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ పే ర్కొన్నారు. ఈ కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇ ద్దరు, నెల్లూరుకి చెందిన ఇద్దరు నేరస్తులు అరెస్ట్ కావల్సి ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. అలాగే అన్న వరం, గాయిత్రి కోలని మెట్టకు చెందిన గుత్తిన పవనహారి ప్రసాద్ ఇంటిలో సెప్టెంబరు 4న రాత్రి దొంగలు పడి దోచుకెళ్లారు. ప్రత్తిపాడు, అన్నవరం పోలీసులు ఈ కేసును చేధించి విశాఖపట్నం భీమిలి, చేపల ఉప్పాడకు చెందిన 38 ఏళ్ల చిన్నమాన ఎల్లాజీ అలియాస్ రాజును అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న ట్టు ఎస్పీ బిందుమాధవ్ పేర్కొన్నారు. ఈ కీలకమైన కేసులను చేధించిన ప్రత్తిపాడు ఎస్‌ఐ లక్ష్మికాంతం, అన్నవరం ఎస్‌ఐ శ్రీహరిబాబు, అడిషనల్ ఎస్‌ఐ ఎల్.ప్రసాద్, ప్రత్తిపాడు, అన్నవరం పోలీస్‌స్టేషన్‌ల సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభి నందించారు. కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ కెవి. సత్యనారాయణ, పెద్దాపురం ఎస్‌డీపీవో డి.శ్రీహరిరాజు తదితరులు పాల్గొన్నారు.