Share News

దారి దోపిడీ ఘటనపై దర్యాప్తు ముమ్మరం

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:49 AM

గొల్లప్రోలు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా గొల్లప్రోలు పట్టణ శివారు చెందుర్తి రోడ్డులో జరిగిన దారి దోపిడీ ఘటనపై పోలీసు లు దర్యాప్తు ముమ్మరం చేశారు. దోపిడీకి పాల్పడిన ఆగంతకులను గుర్తించి పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ పుటేజీ ల ఆధారంగా విచారణ చేపట్టారు. రాజమహేంద్రవరం నల్లమందు సందులోని భవానీ సిల్వర్‌ ప్యాలెస్‌లో గుమస్తాగా పనిచేస్తున్న సమీర్‌ ప్రజాప్రత్‌ పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలుల్లో వెం

దారి దోపిడీ ఘటనపై దర్యాప్తు ముమ్మరం
బాధితుడి నుంచి వివరాలు సేకరిస్తున్న పిఠాపురం సీఐ శ్రీనివాస్‌

విచారణకు 5 ప్రత్యేక బృందాలు

సీసీ కెమెరాల పరిశీలన

గొల్లప్రోలు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా గొల్లప్రోలు పట్టణ శివారు చెందుర్తి రోడ్డులో జరిగిన దారి దోపిడీ ఘటనపై పోలీసు లు దర్యాప్తు ముమ్మరం చేశారు. దోపిడీకి పాల్పడిన ఆగంతకులను గుర్తించి పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ పుటేజీ ల ఆధారంగా విచారణ చేపట్టారు. రాజమహేంద్రవరం నల్లమందు సందులోని భవానీ సిల్వర్‌ ప్యాలెస్‌లో గుమస్తాగా పనిచేస్తున్న సమీర్‌ ప్రజాప్రత్‌ పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలుల్లో వెండి, బంగారు వస్తువులు డెలివరీ ఇచ్చి వారు ఇచ్చిన ముడి వెండి, నగదును తీసుకుని ఎన్‌హెచ్‌ 216 నుంచి చెందుర్తి వెళ్లే రోడ్డులోకి వెళ్లగా పామాయిల్‌ తోటల వద్ద సోమవారం రాత్రి 2 మోటార్‌సైకిళ్లపై నలుగురు ఆగంతకుల వచ్చి అతడిపై దౌర్జన్యం చేసి బెదిరించి ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగులను లాక్కుని పరారయ్యారు. ఇందులో 12.5కిలోల వెండి వస్తువులు, ముడి వెండి, 51 గ్రాముల బంగారం వస్తువులు, 60వేలు నగదు ఉన్నట్టు ప్రజాప్రత్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పిఠాపురం సీఐ శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. కేసులో విచారణకు పిఠాపురం సీఐ, సర్కిల్‌లోని నలుగురు ఎస్‌ఐల నేతృత్వంలో 5 విచారణ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌, కాకినాడ ఏఎస్పీ మనీష్‌ దేవరాజ్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో వారు విచారణ చేపట్టారు. పిఠాపురం నుంచి గొల్లప్రోలు వరకూ, 216వ జాతీయరహదారి వెంబడి ఉన్న గోడౌన్లు, రైసుమిల్లులు, ఇతర భవనాల సీసీ కెమెరాల ఫు టేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సంఘట న జరిగిన సమయంలో వెళ్లిన ద్విచక్ర వాహనాలను గుర్తించే పనిలోపడ్డారు. ఇంత భారీ మొ త్తంలో వెండి, బంగారు వస్తువులును ఎటువంటి రక్షణ లేకుండా ఎలా తీసుకువెళ్తున్నాడు అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వారు చేశారా, లేకా సమీర్‌ ప్రజాప్రత్‌ రాకపోకలను గుర్తించి రాజమహేంద్రవరం లేదా పెద్దాపురం, పిఠాపురం నుంచి వెంబడించి ఆగంతకులు ఈ పని చేశారా అనే విషయాన్ని వారు పరిశీలిస్తున్నారు. ఫిర్యాదులోని అంశాలపైనే బాధితుడిని వివిధ కోణాల్లో ప్రశ్నించి వివరాలు రాబట్టారు.

Updated Date - Jul 30 , 2025 | 12:49 AM