Share News

చోరీ కేసుల్లో ఐదుగురి అరెస్ట్‌

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:39 AM

కాకినాడ రూరల్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.17.50 లక్షల విలువచేసే 135 గ్రాము ల బంగారు ఆభరణాలు, 1567 గ్రాముల వెండి ఆభరణాలు, పల్సర్‌ మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు కాకినాడ ఎస్‌డీపీవో మనీష్‌ దేవరాజ్‌ పాటిల్‌ తెలిపారు. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాకినాడ రూరల్‌ సీఐ డీఎస్‌ చైతన్యకృష్ణ

చోరీ కేసుల్లో ఐదుగురి అరెస్ట్‌
సమావేశంలో వివరాలను వెల్లడిస్తున్న కాకినాడ డీఎస్పీ మనీష్‌ దేవరాజ్‌ పాటిల్‌

రూ.17.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం

కాకినాడ రూరల్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.17.50 లక్షల విలువచేసే 135 గ్రాము ల బంగారు ఆభరణాలు, 1567 గ్రాముల వెండి ఆభరణాలు, పల్సర్‌ మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు కాకినాడ ఎస్‌డీపీవో మనీష్‌ దేవరాజ్‌ పాటిల్‌ తెలిపారు. కాకినాడ డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాకినాడ రూరల్‌ సీఐ డీఎస్‌ చైతన్యకృష్ణతో కలిసి చోరీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 5 కేసుల్లో నింది తులైన కాకినాడ జగన్నాధపురం సత్యదేవనగర్‌ ప్రాంతానికి చెందిన గంపల సతీష్‌, యానాం బాలయోగి నగర్‌ ప్రాంతానికి చెందిన మల్లాడి దుర్గాప్రసాద్‌, కాకినాడ గొడారిగుంటకు చెందిన కాలాడి అర్జునరావు, బిక్కవోలు మండలం బలభద్రపురానికి చెందిన గొర్రిపూడి వెంకటరమణను అరెస్టు చేశామన్నారు. అదేవిధంగా కాకినాడ పోర్టు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రెండు కేసుల్లో ఏటిమొగకు చెందిన రేకాడి వెంకటేశ్వర్లును అ రెస్టు చేసినట్టు తెలిపారు. అనంతరం సీఐ చైతన్యకృష్ణ మాట్లాడుతూ ఎవరైనా ఇతరప్రాంతాలకు వెళ్లినప్పుడు దొంగలకు కనిపించే విధంగా బయటిగేటుకు తాళం కప్పలు వేయవద్దని ఎల్‌ హెచ్‌ఎంస్‌ని ఉపయోగించుకోవాలని సూచించారు. సమావేశంలో క్రైం సీఐ వి.కృష్ణ, కాకినాడ పోర్టు సీఐ సునీల్‌ కుమార్‌, ఇంద్రపాలెం ఎస్‌ఐ వీరబాబు పాల్గొనగా నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Updated Date - Jul 15 , 2025 | 12:39 AM