Share News

చోరీ కేసులో ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:28 AM

రాజానగరం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నామవరంలో ఇటీవల జరిగిన చోరీ కేసు కు సంబంధించి నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వై.శ్రీకాంత్‌ తెలిపారు. ఈమేరకు రాజానగరం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకర్ల స మావేశంలో వివరాలను వెల్లడించారు. నామవరం గ్రామానికి చెందిన రేలంగి లోవరాజు ఈ నెల 2న కుటుంబ సభ్యులతో కలిసి కా కినాడ జి ల్లా

చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
రాజానగరం పోలీస్‌స్టేషన్‌లో నిందితుల వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

22 కాసుల బంగారు ఆభరణాలు, రూ.1.15 లక్షల నగదు స్వాధీనం

రాజానగరం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నామవరంలో ఇటీవల జరిగిన చోరీ కేసు కు సంబంధించి నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వై.శ్రీకాంత్‌ తెలిపారు. ఈమేరకు రాజానగరం పోలీస్‌స్టేషన్‌లో బుధవారం విలేకర్ల స మావేశంలో వివరాలను వెల్లడించారు. నామవరం గ్రామానికి చెందిన రేలంగి లోవరాజు ఈ నెల 2న కుటుంబ సభ్యులతో కలిసి కా కినాడ జి ల్లా తుని మండలం తలుపులమ్మ లోవ అమ్మ వారి దర్శనానికి బయలుదేరి వెళ్లి తిరిగి రాత్రికి ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన లోవరాజు లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళా లు బద్దలు కొట్టి 22 కాసుల బంగారు ఆభరణాలు, రూ.1.75 లక్షల నగదును దొంగలు అపహరించినట్టుగా గుర్తించారు. లోవరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజానగరం పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ నరసింహకిషోర్‌ ఆదేశాల మేరకు నార్త్‌ జోన్‌ డీఎస్పీ వై.శ్రీకాంత్‌ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేపట్టారు. సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్‌కు అందిన సమాచారం మేరకు రాజమహేంద్రవరం రూరల్‌ శాటిలైట్‌ సిటీ గ్రామానికి చెందిన నలబా సత్యనారాయణ, రాజవోలు గ్రామానికి చెందిన బెదంపూడి రత్నరాజు, ఇనకోటి పవన్‌కుమార్‌ను బుధవారం అరెస్టు చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు. చోరీకి గురైన బంగారు ఆభరణాలతో పాటు రూ. 1.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామ న్నారు. నిందితులను పట్టుకున్న సీఐ ప్రసన్న వీ రయ్య గౌడ్‌, సీసీఎస్‌ సీఐలు శ్రీధర్‌కుమార్‌, బలసౌరి, ఎస్‌ఐలు కే.నాగార్జున, సిబ్బంది అ మ్మిరా జు, సత్యనారాయణ, కరీం, సురేష్‌, మురళీ, ప్ర సాద్‌, రమణ, శివరామకృష్ణను అభినందించారు.

Updated Date - Jul 10 , 2025 | 12:28 AM