చోరీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్ట్
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:35 AM
అన్నవరం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా అన్నవరం పరిసర పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇటీవల జరుగుతున్న వరుస చోరీలపై జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ, ప్రత్తిపాడు సీఐ పర్యవేక్షణలో భాగంగా ఆదివారం అన్నవరం జాతీయ రహదారిపై ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.
రూ.9.80 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
అన్నవరం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా అన్నవరం పరిసర పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇటీవల జరుగుతున్న వరుస చోరీలపై జిల్లా ఎస్పీ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ, ప్రత్తిపాడు సీఐ పర్యవేక్షణలో భాగంగా ఆదివారం అన్నవరం జాతీయ రహదారిపై ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.9.80 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసు కున్నట్టు డీఎస్పీ శ్రీ హరిరాజు తెలిపారు. రంపచోడవరానికి చెందిన అడపా సూర్యచంద్ర, కిర్లంపూడికి చెందిన అడపా జోగా అమర్‌గంగాధర్ హైదరాబాద్, వైజాగ్, తు ని, ప్రత్తిపాడు, అన్నవరం పోలీస్‌స్టేషన్ పరిదిలో వరుస చోరీలకు పాల్పడేవారని పేర్కొన్నారు. 16 కేసుల్లో నిందితుల నుంచి 13 మోటార్‌బైక్‌లు, అర కిలో వెండి వస్తువులు, టీవి, అమ్మవారికి ధరించే రోల్డ్‌గోల్డ్ హారం స్వాధీనం చేసుకోగా ఈ సొత్తు విలువ రూ.9.80 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి ప్రత్తిపాడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామన్నారు. సమావేశంలో ప్రత్తిపాడు సీఐ సూరిఅప్పారావు, అన్నవరం ఎస్‌ఐ హరిబాబు తదితరులు ఉన్నారు.