Share News

చోరీ చేసి చిక్కారు..

ABN , Publish Date - Sep 03 , 2025 | 01:55 AM

ముమ్మిడివరం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దోపిడీకి పాల్పడిన ఇద్దరు యువకులను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్ప

చోరీ చేసి చిక్కారు..
ఠాణేలంకలో యువకులను చెట్టుకు కట్టిన దృశ్యం

ఠాణేలంకలో ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగింత

ముమ్మిడివరం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దోపిడీకి పాల్పడిన ఇద్దరు యువకులను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన చేబోలు సుబ్రహ్మణ్యం తన ఇంటిని అద్దెకు ఇచ్చి అమలాపురంలో ఉంటున్నాడు. ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నవారు కూడా ఇటీవలే ఖాళీ చేయడంతో ఇంటికి తాళం వేశారు. అయితే సుబ్రహ్మణ్యం తన పాత ఇత్తడి సామాన్లను ఒక గదిలో పెట్టి తాళాలు వేశాడు. మంగళవారం ఉదయం ముగ్గురు వ్యక్తులు మోటారు రిక్షాలో వచ్చి ఇంటి తలుపులను పగులకొట్టి గదిలో ఉన్న పాత ఇత్తడి సామాగ్రిని దొంగిలించుకుపోతుండగా స్థానికులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరు దొరకగా మరో వ్యక్తి ఇంజను రిక్షాలో పరారయ్యాడు. వారిని చెట్టుకు కట్టి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి వారిని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.

Updated Date - Sep 03 , 2025 | 01:55 AM