Share News

రహదారులు జలమయం

ABN , Publish Date - May 01 , 2025 | 01:07 AM

పగలు ఎండ.. సాయంత్రం ఈదురుగాలుతో కూడిన వర్షం కారణంగా గత మూడు రోజులుగా పలుచోట్ల భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వడగాల్పులతో భానుడు భగభగ మండడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు.

రహదారులు జలమయం
కత్తిపూడి జాతీయ రహదారిపై పారుతున్న వర్షపునీరు

  • భారీ వర్షం.. ఈదురుగాలులు

  • స్థంభించిన జన జీవనం

  • నేలరాలిన మామిడికాయలు

ప్రత్తిపాడు/తుని రూరల్‌/తొండంగి/శంఖవరం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): పగలు ఎండ.. సాయంత్రం ఈదురుగాలుతో కూడిన వర్షం కారణంగా గత మూడు రోజులుగా పలుచోట్ల భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వడగాల్పులతో భానుడు భగభగ మండడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. అయితే సాయంత్రం ఆకాశం మేఘావృతమై చల్లగాలులతో కూడిన వర్షం పడడంతో ఉపశమనం పొందారు. ప్రత్తిపాడు, ధర్మవరం, ఒమ్మంగి, రాచపల్లి తదితర గ్రామాలతోపాటు తుని పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, తొండంగి మండలంలో సాయంత్రం 6 గంటల నుంచి ఎడతెరిపిలేని వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గంట సమయం పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జన జీవనం స్థంభించింది. ఈదురుగాలులకు పలు మామిడి కాయలు నేలరాలి రైతులకు నష్టం వాటిల్లింది. శంఖవరం మండలంలో కొంతవరకూ వరికోతలు అయిపోయినా కళ్లాల్లో ధాన్యం ఉండిపోయిన రైతులు ఇబ్బందులు పడ్డారు. అరటి, మామిడి రైతలకు నష్టం వాటిల్లే ప్రమాదముందని ఉద్యానశాఖాధికారులు అన్నారు.

Updated Date - May 01 , 2025 | 01:07 AM