రూ.1.30 కోట్లతో రోడ్డుకు శంకుస్థాపన
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:23 AM
సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి తొమ్మిదిపేటల రోడ్డును ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఎంపీ హరీష్‌మాధుర్‌లు శనివారం శంకుస్థాపన చేశారు.
అంతర్వేది, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి తొమ్మిదిపేటల రోడ్డును ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఎంపీ హరీష్‌మాధుర్‌లు శనివారం శంకుస్థాపన చేశారు. రూ.కోటి 35 లక్షల ఎంపీ నిధులతో 3.1 కిలోమీటర్ల పొడవునా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఇక్కడ పరిస్థితి ఇలానే ఉందని, ఎటువంటి అభివృద్ధి నోచుకోకుండా ఈ ప్రాంతం మారుమూల ప్రాంతాల్లా ఉన్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోడ్డును నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని తెలిపాశారు. దీనికి సహకరించిన అమలాపురం ఎంపీ హరీష్‌మాధుర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. రూ.కోటి 35 లక్షలు ఎంపీ నిధుల నుంచి కేటాయించడం సామాన్య విషయంకాదని, ఆయన రుణం తీర్చుకోలేమన్నారు. ఎంపీ హరీష్‌మాధుర్ మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గం అంటే ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు నిధులు మంజూరు చేశానన్నారు. గుండుబోగుల పెద్దకాపు, పినిశెట్టి బుజ్జి, ముప్పర్తి నాని, గెడ్డం మహలక్ష్మిప్రసాద్, ముప్పర్తి నాని, తాడి మోహన్‌కుమార్, గొల్లమందుల చిట్టి, మల్లిబాబు పాల్గొన్నారు.