Share News

రోడ్డు పనులు అడ్డుకున్న గ్రామస్తులు

ABN , Publish Date - May 02 , 2025 | 01:41 AM

గెద్దాడ గ్రామంలో పోలీసు బందోబస్తుతో నిర్వహిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను స్థానికులు గురువారం అడ్డుకున్నారు.

 రోడ్డు పనులు అడ్డుకున్న గ్రామస్తులు

మామిడికుదురు, మే 1 (ఆంధ్రజ్యోతి): గెద్దాడ గ్రామంలో పోలీసు బందోబస్తుతో నిర్వహిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను స్థానికులు గురువారం అడ్డుకున్నారు. గ్రామంలో ఎంతో కాలం నుంచి స్థానికుల అభ్యంతరాలతో నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను భారీ బందోబస్తు నడుమ గురువారం ప్రారంభించారు. రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన వెంటనే స్థానికులు తమ గ్రామానికి ఉన్న శ్మశానవాటిక సమస్యను పరిష్కరించి రోడ్డు ఏర్పాటు చేయాలని పనులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అడ్డుకున్న గ్రామస్తులు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విడిచిపెట్టారు. ఒక దశలో పోలీసులకు స్థానికులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీనిపై పోలీసులు రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికే ఆలస్యమయ్యాయని, సమస్య ఏదైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని ఎస్‌ఐ చైతన్యకుమార్‌ సూచించారు. గ్రామస్తులు గ్రామానికి శ్మశానవాటిక స్థలాన్ని కేటాయించి బైపాస్‌ రోడ్డును ఏర్పాటు చేసుకోవాలని కొంతకాలంగా పనులను అడ్డుకుంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసుల బందోబస్తుమధ్యగురువారం రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.

Updated Date - May 02 , 2025 | 01:41 AM