Share News

ఏడీబీ రోడ్డులో వెళ్లేదెలా!

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:40 AM

ఏడీబీ రోడ్డు.. నిత్యం రద్దీగా ఉండే రహదారి ఇది..గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు కష్టాలు చవిచూశారు..

ఏడీబీ రోడ్డులో వెళ్లేదెలా!
ఏడీబీ రోడ్డులో లేచిపోతున్న దుమ్ము

అసంపూర్తిగా రోడ్డు

ఛిద్రమైన రహదారి

దుమ్ము,ధూళితో నరకం

వాహనదారుల ఇక్కట్లు

రాజానగరం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఏడీబీ రోడ్డు.. నిత్యం రద్దీగా ఉండే రహదారి ఇది..గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు కష్టాలు చవిచూశారు.. అయితే కూటమి ప్రభుత్వం వచ్చీ రావడంతోనే ఏడీబీ రోడ్డు సమస్యకు పరిష్కారం చూపిం ది.. సుమారు 35 కిలోమీటర్ల ఉండే రోడ్డులో దాదాపు 32 కిలోమీటర్ల వరకూ రోడ్డును పూర్తి చేశారు..వాహనాలు రయ్‌ రమ్‌మంటూ దూసు కెళ్తాయి..అయితే రంగంపేట ఊరి వద్దకు వచ్చేసరికి ఏ వాహనానికైనా బ్రేక్‌లు పడా ల్సిందే..మరో రెండు కిలో మీటర్లు వేగంగా ప్రయాణించి న తర్వాత రాజానగరం చేరుకునేసరికి మరోసారి బ్రేక్‌లు పడాల్సిందే.. కేవలం మూడు కిలోమీటర్ల మేర రహదారి మాత్రమే అసంపూర్తిగా నిలిచి పోయింది. దీంతో వాహనదారులు..అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. ప్రయాణికులు పాలిట శాపంగా పరిణమించాయి. ప్రధానంగా రాజానగరం హైస్కూల్‌ సమీపంలో రహదారి పూర్తిగా ఛిద్రమైంది.. చినుకు పడితే చెరువులా మారిపోతోంది. లేదంటే దుమ్ముతో రోడ్డు కనిపించకుండా పోతోంది. వాహనాల రాకపోకలతో దుమ్ము, ధూళి ఎగసిపడుతోంది. ఈ ప్రాంతంలోని దుకాణదారులు, నివాసిత ప్రజల ఇళ్లలోకి దుమ్ము చేరడంతో రాత్రి పగలు తేడా లేకుండా తలుపులు మూసుకుని కాలం వెళ్లదీస్తున్నా మంటూ స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. రాజానగరం హైస్కూల్‌ కూడలి లో ఫ్లయ్‌ ఓవర్‌ నిర్మించాలి ఉంది. పరిహారం వ్యత్యాసం విషయమై ఈ ప్రాంతంలోని కొంత మంది కోర్డును ఆశ్రయించడంతో ఫ్లయ్‌ ఓవర్‌ నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతో రహదారి అభివృద్ధి పనుల్లో జాప్యం తలెత్తింది. కేవలం కిలోమీటరు పరిధి కూడా ఉండని ప్రాంతంలోని ప్రజలు నిత్యం దుమ్ము, ధూళితో సహవాసం చేయడం పరిపాటిగా మారింది. దీనిపై సంబంధిత అఽధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోతోందని ప్రజలు వాపోతున్నారు.చేసేదిలేక నివాసితులు మోటార్లు వినియోగించి నీటి తో ప్రతిరోజు దుమ్ములేచిపోకుండా తడుపుకుంటున్నారు.ఇప్పటికైనా అధికా రులు దృష్టిసారించి ఏడీబీ రోడ్డు పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

నిధులు రావాల్సి ఉంది..

పరిహారం విషయమై కొంత మంది కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలి చిపోయాయి.పరిహారాన్ని కోర్టులో చెల్లిం చాం.అదనపు నిధులు మంజూరుకు ఉన్నతాధికారులకు నివేదించాం. త్వర లోనే నిఽధులు విడుదలకానున్నాయి. సం క్రాంతి అనంతరం ఫ్లయ్‌ ఓవర్‌, బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.

- సి.మనోహర్‌, ప్రాజెక్టు మేనేజర్‌

Updated Date - Dec 26 , 2025 | 12:40 AM