వెళ్లొస్తాం అంటూ.. తిరిగిరాని లోకాలకు!
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:25 AM
నల్లజర్ల, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): పోతవరం- యర్నగూడెం రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికులు తె లిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన మల్లేశ్ (22) అతడి తల్లి రత్న కుమారి, చెల్లి అంకిత, మేనకోడలు ప్రియ ఆర్జి (3
వేప చెట్టును కారు ఢీకొనడంతో ఇద్దరి మృతి
మరో ఇద్దరికి గాయాలు
పోతవరంలో విషాదఛాయలు
నల్లజర్ల, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): పోతవరం- యర్నగూడెం రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికులు తె లిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన మల్లేశ్ (22) అతడి తల్లి రత్న కుమారి, చెల్లి అంకిత, మేనకోడలు ప్రియ ఆర్జి (3) తో కలిసి తన కారులో నిడదవోలు ద గ్గర కలవచర్లకు ఓ వివాహ రిసెప్షన్ కు వెళ్తుండగా పోతవరం- యర్న గూడెం గ్రామాల మధ్య రహదారి పక్కనే ఉన్న వేప చెట్టును కారు ఢీకొంది. మల్లేశ్ అక్కడిక్కడే మృతిచెందగా ఆర్జి, రత్నకుమారి, అంకితకు గాయాలు కాగా ఏలూరు ఆసుపత్రికి తరలిం చారు. ఆర్జి చికిత్స పొందుతూ మృతిచెందింది. వారు ఇంటి నుంచి బయలుదేరిన 5 నిమి షాల్లో ప్రమాదం జరి గింది. 5 నిమిషాల క్రితం బయలుదేరిన వారు మృత్యువాడ పడ డంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధి ంచడంతో స్థానికులు కంటతడి పెట్టారు. మ ల్లేశ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చే స్తూ జాతర కోసం పోతవరం వచ్చి కుటు ంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నాడు. ఇలాంటి తరుణంలో దుర్ఘటన జరగడంతో పో తవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.