Share News

వైద్యం కోసం వెళ్తుండగా కబళించిన మృత్యువు

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:18 AM

గండేపల్లి/ఆత్రేయపురం, డిసెంబరు 16 (ఆం ధ్రజ్యోతి): క్యాన్సర్‌తో బాధపడుతున్న కుమారు డికి మెరుగైన వైద్యం చేయించి కాపాడుకోవా లని అనుకుంది ఆ తల్లి. అందుకోసం కొడుకుని వెంటపెట్టుకుని కారులో వైజాగ్‌కు పయన మైంది. కానీ ఆసుపత్రికి వెళ్లకుండానే తల్లీకొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషాద సంఘటన కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లిలో జరిగింది. వివరాల ప్రకా రం.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జి

వైద్యం కోసం వెళ్తుండగా కబళించిన మృత్యువు
మృతిచెందిన తులసీ, శశికుమార్‌ (ఫైల్‌)

ఎదురుగా వెళ్తున్న ట్రాలీని ఢీకొన్న కారు

తల్లీకొడుకుల మృత్యువాత

మరో ముగ్గురికి తీవ్రగాయాలు

గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఘటన

గండేపల్లి/ఆత్రేయపురం, డిసెంబరు 16 (ఆం ధ్రజ్యోతి): క్యాన్సర్‌తో బాధపడుతున్న కుమారు డికి మెరుగైన వైద్యం చేయించి కాపాడుకోవా లని అనుకుంది ఆ తల్లి. అందుకోసం కొడుకుని వెంటపెట్టుకుని కారులో వైజాగ్‌కు పయన మైంది. కానీ ఆసుపత్రికి వెళ్లకుండానే తల్లీకొడుకులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషాద సంఘటన కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లిలో జరిగింది. వివరాల ప్రకా రం.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరుకు చెందిన తోర్లపాటి వీరాస్వామి, తులసీ దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు శశికుమార్‌, చిన్న కుమారుడు సంజయ్‌. గత కొద్దికాలంగా శశికుమార్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. దీంతో అతడికి మెరుగైన వైద్యం చేయించేందుకు విశాఖపట్నంలోని ఓ ప్రవేట్‌ ఆసుపత్రిలో చూపించాలను కుంది తల్లి. మంగళవారం తెల్లవారుజామున వెలిచేరు నుంచి అద్దెకు తీసుకున్న కారులో తల్లి తులసీ, ఇద్దరు కుమారులతో పాటు కుటుంబీకులు వీరాస్వామి, అప్పారావు పయనమయ్యా రు. సంజయ్‌ కారు డ్రైవింగ్‌ చేస్తుండగా కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ శివారున హైవేపై కారు ఎదురుగా వెళ్తున్న ట్రాలీని ఢీకొంది. ఈ సంఘటనలో తులసీ (49) అక్కడిక్కడే మృతిచెందింది. తీవ్ర గాయాలైన శశికుమా ర్‌(27)ను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా మృతిచెందాడు. సంజయ్‌, వీరాస్వామి, అప్పారావుకు గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న జగ్గంపేట సీఐ వైఆర్‌కె శ్రీనివాస్‌, గండేపల్లి ఎస్‌ఐ యువి శివనాగబాబు సంఘటన ప్రాంతానికి చేరుకుని గాయపడినవారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తులసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్‌.రాగంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ శివనాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతివార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. వైద్యం కోసం వెళ్తూ తల్లీకొడుకులు మృతి చెందడంతో వెలిచేరు గ్రామంలో విషాదం అలుముకుంది.

Updated Date - Dec 17 , 2025 | 12:18 AM