కొడుకుని చూసేందుకు వెళ్తూ తండ్రి మృత్యువాత
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:22 AM
కిర్లంపూడి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి లారీని బైక్ ఢీకొన్న సంఘటనలో యువకుడు మృతిచెందాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిల్లంగి గ్రామానికి చెందిన కొప్పన అప్పారావు(29) ఆదివారం రాత్రి చిల్లంగి నుంచి వీరవరం అత్తవారింటికి వెళ్తుండగా రాజుపాలెం గ్రామం వద్ద ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అప్పారావు ప్రమాదవశాత్తు ఆ

రాజుపాలెం రహదారిపై
మృతదేహంతో బంధువుల ఆందోళన
కిర్లంపూడి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి లారీని బైక్ ఢీకొన్న సంఘటనలో యువకుడు మృతిచెందాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చిల్లంగి గ్రామానికి చెందిన కొప్పన అప్పారావు(29) ఆదివారం రాత్రి చిల్లంగి నుంచి వీరవరం అత్తవారింటికి వెళ్తుండగా రాజుపాలెం గ్రామం వద్ద ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో అప్పారావు ప్రమాదవశాత్తు ఆ లారీని వెనుక నుంచి బైక్‌తో ఢీకొన్నాడు. దీంతో అప్పారావు తలకు బలయమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ డ్రైవర్ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బంధువులు సోమవారం ఉదయం రాజుపాలెం నుంచి సామర్లకోట వెళ్లే రహదారిపై మృతదేహంతో నిరసన తెలిపారు. దీంతో భారీగా ట్రాఫి క్‌కు అంత రాయం ఏర్పడింది. వెంటనే కిర్లంపూడి పోలీసులు, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు, జగ్గంపేట సీఐ వైఆర్‌కె శ్రీనివాస్ సంఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. బంధువులతో మాట్లా డి న్యాయం చేస్తామని నచ్చజెప్పారు. మృతదేహాన్ని ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
4 నెలల క్రితమే కొడుకు పుట్టడంతో..
అయితే అప్పారావు తాపీపని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. అతడికి భార్య, కూతురు, ఉన్నారు. కాగా 4 నెలల కిత్రమే కొడుకు పుట్టాడు. కుమారుడిని చూసేందుకు ఆదివారం రాత్రి వెళ్తుండగా అప్పారావును మృత్యువు లారీ రూపంలో కబలించేసింది. ఈ దుర్ఘటనతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీంతో అటు చిల్లంగి, ఇటు వీరవరం గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. పిల్లలిద్దరూ అనాధలైపోయారని అప్పారావు భార్య, బంధువులు రోధనలు మిన్నంటాయి. ప్ర భుత్వం తమకు న్యాయం చేయాలని మృతుడు అప్పారావు బంధువులు కోరుతున్నారు.