అమ్మమ్మను ఇంటి వద్ద దింపి వస్తుండగా అన్నదమ్ముల మృతి
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:05 AM
ఐ.పోలవరం/ముమ్మిడివరం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): తమ ఇంట్లో జరిగే శుభకార్యానికి వచ్చిన అమ్మమ్మను తిరిగి వాళ్లింటి దగ్గర దింపేందుకు మోటారుసైకిల్‌పై వెళ్లిన అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతిచెందా రు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం బాలయోగి బ్రిడ్జిపై మంగళవారం రాత్రి ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఐ.పోలవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లరేవు మండలం సుంకరపాలె

గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మరణం
ఐ.పోలవరం మండలం బాలయోగి బ్రిడ్జిపై ఘటన
ఐ.పోలవరం/ముమ్మిడివరం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): తమ ఇంట్లో జరిగే శుభకార్యానికి వచ్చిన అమ్మమ్మను తిరిగి వాళ్లింటి దగ్గర దింపేందుకు మోటారుసైకిల్‌పై వెళ్లిన అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మృతిచెందా రు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం బాలయోగి బ్రిడ్జిపై మంగళవారం రాత్రి ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఐ.పోలవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లరేవు మండలం సుంకరపాలెనికి చెందిన ఎల్లా వీరేంద్ర(17), ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన వేమవరపు సాంబశివ (14) వరుసకు అన్నదమ్ములు అవుతారు. వీరేంద్ర కొత్తలంకలో బంధువుల ఇంటి వద్ద ఉంటున్నాడు. వారిద్దరు వీరేంద్ర అమ్మమ్మను సుంకరపాలెంలో దింపి బైక్‌పై తిరిగి వస్తుండగా యానాం బ్రిడ్జిపై గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఇద్దరికి తలపై బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బుధవారం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఐ.పోలవరం ఎస్‌ఐ ఆర్.మల్లిఖార్జునరెడ్డి తెలిపారు. వేమవరపు ఏసురాజు-గంగాభవానీ దంపతుల చిన్న కుమారుడు సాంబశివ 9వ తరగతి చదువుతున్నాడు. మోటారుసైకిల్‌పై సాంబశివ, వీరేంద్ర అమ్మమ్మను దింపి తిరిగి వస్తుండగా మృత్యువాతకు గురవ్వడంతో తల్లిదండ్రులు రోధిస్తున్నారు.
సుంకరపాలెంలో విషాదచాయలు
తాళ్లరేవు, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఐ.పోలవరం మండలం బాలయోగి బ్రిడ్డిపై రోడ్డు ప్రమాదంలో కాకినాడ జిల్లా సుంకరపాలెం యువకుడు ఎల్లా వీరేంద్ర మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలము కున్నాయి. వీరేంద్ర మినీ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తుండగా తండ్రి సూరిబాబు తాపీమేస్తి, తల్లి రాముడు గృహని, చెల్లి సిరి 9వ తరగతి చదువుతుంది.