ఆర్‌ఎంసీలో నూతన భవనాల నిర్మాణానికి ప్రభుత్వంతో ఎంవోయూ
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:21 AM
జీజీహెచ్ (కాకినాడ), నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (రాంకోసా) ప్ర భుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుం
జీజీహెచ్ (కాకినాడ), నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (రాంకోసా) ప్ర భుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. ఆర్‌ఎంసీ ప్రధాన భవనం పాతది కావడంతో దాని బలోపేతం కోరుతూ రాంకోసా బృందం చేసిన విన్నపానికి స్పందించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గురువారం విజయవాడలోని డీఎంఈ కార్యాలయంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ డా క్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో బృందం డీఎంఈ డాక్ట ర్ జి.రఘునందన్‌ను కలిసింది. ఈ నేపథ్యంలో రాంకోసా ప్రతినిధులు డీఎంఈని కలిసి రూ.15 కోట్లతో భవనాలు నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. బిల్డింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్, రాంకోసా కార్యదర్శి డాక్టర్ అరుణాదిత్య, డాక్టర్ వాడ్రేవు రవి పాల్గొన్నారు.