నకిలీ ఈపీఎఫ్ చలానాలపై అన్నవరంలో ఆర్జేసీ విచారణ
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:25 AM
అన్నవరం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో శానిటరీ కార్మికుల పీఎఫ్ చెల్లింపులకు సంబంధించి నకిలీ చలానాల వ్యవహారంపై దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాలతో బుధవారం ఆర్జేసీ త్రినాధరావు విచారణ చేపట్టారు. ఈవో కార్యాలయంలో శానిటరీ విభాగ అధికారులు,
అన్నవరం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో శానిటరీ కార్మికుల పీఎఫ్ చెల్లింపులకు సంబంధించి నకిలీ చలానాల వ్యవహారంపై దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాలతో బుధవారం ఆర్జేసీ త్రినాధరావు విచారణ చేపట్టారు. ఈవో కార్యాలయంలో శానిటరీ విభాగ అధికారులు, శానిటరీ కాంట్రాక్టర్‌ను పిలిచి దీనికి సంబంధించి విచారణ చేపట్టారు. నకిలీ చలానాలు ఏ విధంగా సమర్పించారు అని కాంట్రాక్టర్ తరుపు న వ్యక్తిని ప్రశ్నించగా అవి తాము సమర్పించినవి కాదని, తాము సమర్పించిన్టయితే తమ సంస్థ స్టాంప్, సంతకం ఉంటాయని వివరణ ఇ చ్చారు. వివాదం తరువాత ఒకే నెలలో 3 రసీదులు ఒరిజనల్ ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. ఇరువర్గాల నుంచి సమాచారం సేకరించిన ఆర్జేసీ త్రినాథరావు నివేదికను కమిషనర్‌కు సమర్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఈవో సుబ్బారావు, శానిటరీ ఏఈవో శ్రీనివాస్, సూపరెంటెండెంట్ గుర్రాజు తదితరులు ఉన్నారు.