Share News

రైస్‌ మిల్లర్లంతా సంఘటితం కావాలి

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:08 AM

రాష్ట్రంలోని రైస్‌ మిల్లర్లంతా సంఘటితంగా ఐక మత్యంతో మెలగాలని రైస్‌ మిల్లర్స్‌ అసోసియే షన్‌ రాష్ట్రాధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రాజానగరంలోని రాయల్‌ ఫం క్షన్‌ హాల్లో ఆదివారం జరిగిన రైస్‌ మిల్లర్ల అసో సియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీ కారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.

రైస్‌ మిల్లర్లంతా సంఘటితం కావాలి
రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గం

  • రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ సమావేశంలో రాష్ట్రాధ్యక్షుడు వెంటేశ్వరరావు

  • జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారం

రాజానగరం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని రైస్‌ మిల్లర్లంతా సంఘటితంగా ఐక మత్యంతో మెలగాలని రైస్‌ మిల్లర్స్‌ అసోసియే షన్‌ రాష్ట్రాధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రాజానగరంలోని రాయల్‌ ఫం క్షన్‌ హాల్లో ఆదివారం జరిగిన రైస్‌ మిల్లర్ల అసో సియేషన్‌ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీ కారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. జిల్లాల విభజన అనంతరం తలె త్తిన ఇబ్బందులను చక్కబెట్టి ఒక తాటిపైకి తేవడానికి కృషి చేస్తున్నామని, దీనిని దృష్టిలో ఉంచుకుని రైస్‌మిల్లు యజమానులు బేషజాల కు పోకుండా ఐకమత్యంగా ఉండాలన్నారు. మ రో ముఖ్యఅతిథి రాష్ట్ర కార్యదర్శి వల్లూరి సూర్య ప్రకాశరావు(సూరిబాబు) మాట్లాడుతూ రైస్‌మి ల్లు రంగం పలు సమస్యలతో సత మతమవుతోందని, వాటిని అధిగమిం చడానికి అందరం కలిసిగట్టుగా పయ నించాలని సూచించారు. రైస్‌ మిల్లర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశ గా కృషి చేస్తున్నామని, ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం అనపర్తికి చెందిన అధ్యక్షుడిగా కర్రి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా యూబీఎస్‌ఎన్‌ మూర్తి, ఉపాధ్యక్షుడిగా బి.ఆంజనేయమూర్తి, సం యుక్త కార్యదర్శిగా కె.సుధాకర్‌, ట్రెజర్‌గా ఎం. రామ్మూర్తిరెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లా ల అధ్యక్షులతో పాటు రైస్‌ మిల్లర్లు పాల్లొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 12:08 AM