హైదరాబాద్‌లో రేవ్ పార్టీ.. కోనసీమ వాసుల అరెస్ట్!
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:44 AM
అమలాపురం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని కొండాపూర్ లో ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేవ్ పార్టీపై గచ్చిబౌలి పోలీసులు, ఈగల్
అమలాపురం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని కొండాపూర్ లో ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేవ్ పార్టీపై గచ్చిబౌలి పోలీసులు, ఈగల్ టీమ్ దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన వారిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఇద్దరు యువకులు ఉన్నట్టు సమాచారం. వారి లో రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామానికి చెందిన తేజారెడ్డి, ఆలమూరు మండలం జొన్నాడకు చెందిన విక్రమ్‌రెడ్డి ఉన్నట్టు భావిస్తున్నారు. వారు హైదరాబాద్‌లో నివాసముంటున్నట్టు తెలుస్తుంది. గతేడాది డ్రగ్స్ కేసులో విక్రమ్‌రెడ్డి ఉన్నారు. అయితే కొత్తపేట సబ్‌డివిజన్ పరిధిలోని పోలీసులకు ఎటువంటి సమాచారం లేదు. హైదరాబాద్ డ్రగ్స్ లింక్‌లపై జోరు గా ఆ ప్రాంతంలో జోరుగా చర్చ జరుగుతుంది.
రెవెన్యూ అధికారి పేరు కూడా...
రాజమహేంద్రవరం, ఆగస్టు 25 (ఆంధ్ర జ్యోతి): హైదరాబాద్‌లో రేవ్ పార్టీ కేసులో రాజమండ్రికి చెందిన రెవెన్యూ అధికారి మణి దీప్ పేరు ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఆయన మాట్లాడుతూ నేను అసలు ఇటీవల హైదరాబాద్ వెళ్లలేదని, ఇక్కడే ఉన్నానని చెప్పారు. అయితే ఈ కేసుపై తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్‌ను ఆరా తీయగా తాము హైదారాబాద్ నుంచి సమాచా రం కోరామని, రికార్డులన్నీ పరిశీలించి ఒక స్పష్టత తెస్తామని ఆయన పేర్కొన్నారు.