తిరిగి ఇచ్చేయాలి...లేదంటే లాస్ అయిపోతారు
ABN , Publish Date - Nov 14 , 2025 | 02:36 AM
కాకినాడ జిల్లాలో వివిధ బ్యాంకుల్లో ఉన్న వ్యక్తిగత ఖాతాలు 5,72,938.. ఆ ఖాతాల్లో ఉన్న సొమ్ములు అక్షరాలా రూ.83.36 కోట్లు.. వివిధ సంస్థల బ్యాంకు ఖాతాలు 10,048. ఆ ఖాతాల్లో ఉన్న సొమ్ము రూ.12.60 కోట్లు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకు ఖాతాలు 5,535. వాటిలో ఉన్న సొమ్ము విలువ రూ.5.26కోట్లు... ఇలా మొత్తం 5,88,521 బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్ము రూ.101.22 కోట్లు.. సుమారు రూ. 100 కోట్లకు పైగా ధనం వివిధ బ్యాంకుల్లో మూలుగుతోంది.
(కాకినాడ- ఆంధ్రజ్యోతి)
కాకినాడ జిల్లాలో వివిధ బ్యాంకుల్లో ఉన్న వ్యక్తిగత ఖాతాలు 5,72,938.. ఆ ఖాతాల్లో ఉన్న సొమ్ములు అక్షరాలా రూ.83.36 కోట్లు.. వివిధ సంస్థల బ్యాంకు ఖాతాలు 10,048. ఆ ఖాతాల్లో ఉన్న సొమ్ము రూ.12.60 కోట్లు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బ్యాంకు ఖాతాలు 5,535. వాటిలో ఉన్న సొమ్ము విలువ రూ.5.26కోట్లు... ఇలా మొత్తం 5,88,521 బ్యాంకు ఖాతాల్లో ఉన్న సొమ్ము రూ.101.22 కోట్లు.. సుమారు రూ. 100 కోట్లకు పైగా ధనం వివిధ బ్యాంకుల్లో మూలుగుతోంది. వాస్తవానికి పదేళ్లకు పైగా లక్షలాది ఈ ఖాతాల్లో లావాదేవీలు జరగడం లేదు.. ఈ ఖాతాలకు సంబంధించిన వ్యక్తులు, సంస్థల ప్రతినిధులు సరైన ధ్రువపత్రాలతో వచ్చి ఈకేవైసీ పూర్తి చేసి, తమ సొమ్ములను తీసుకువెళ్లాలని ఇటీ వల జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ సూచించారు. పౌరులు మత పేరున ఉన్న క్లెయి మ్ చేయని, మరిచిపోయిన ఆర్థిక ఆస్తుల ను తిరిగి పొందే అవకాశం కల్పించిందని, దేశవ్యాప్తంగా ’మీడబ్బు- మీ హక్కు’ నినాదంతో భారత ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని ప్రకటించారు. పదేళ్లు అంతకుమించి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లో సొమ్మును బ్యాంకులు తిరిగి ఇచ్చేస్తున్నాయని ఇటీవల వెల్లడించిన విషయం అం దరికీ తెలిసిందే..
నేడు కాకినాడలో ప్రత్యేక శిబిరం..
’మీ డబ్బు - మీ హక్కు’ నినాదంతో భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వివిధ కారణాలతో బ్యాంకు ఖాతాల్లో ఉండిపోయిన సొమ్మును తిరిగి పొందేందుకు భారత ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ మార్గనిర్దేశం మేరకు ఈనెల 14న లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలోని తిలక్ స్ర్టీట్‌లోని గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖాలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్టు లీడ్ బ్యాంకు మేనేజర్ సీహెచ్‌ఎస్‌వీ ప్రసాద్ తెలిపారు. పదేళ్లు, అంతకుమించి లావాదేవీలు జరగని బ్యాంకు ఖాతాల్లోని సొమ్ములు అర్హులైన ఖాతాదారులకు తిరిగి ఇచ్చేస్తున్నామన్నారు. ఖాతాదారుని మరణం, చిరునామా మార్పు, నామినీ వివరాలలో లోపాలు, మరచిపోవడం వంటి కారణాలతో కొన్ని ఖాతాల్లోని డబ్బులు నిజనమైన లబ్ధిదారులకు చేరడం లేదన్నారు. వీటికి సంబంధించిన వ్యక్తులు, సంస్థల పత్రినిధులు సరైన ధ్రువపత్రాలు తీసుకువచ్చి వాటిని తిరిగి పొందాలని ఆయన సూచించారు.