Share News

దుర్వాసన నుంచి వాంబే వాసులకు విముక్తి

ABN , Publish Date - May 24 , 2025 | 11:59 PM

రాజమహేంద్రవరంలోని ఆర్‌అండ్‌బీ వాంబే కాలనీ, సమీప ప్రాంతాల ప్రజలకు డంపింగ్‌యార్డు దుర్వాసన నుంచి ఇన్నాళ్లకు విముక్తి కలిగిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక పేపరుమిల్లు రోడ్డులోని ఆర్‌అండ్‌బీ వాంబే కాలనీకి సమీపంలోని డంపింగ్‌ యార్డులో రూ.5.72 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన లెగసీ వేస్ట్‌ మెనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ను ఆయన ముఖ్యఅతిథిగా శనివారం ప్రారంభించారు.

దుర్వాసన నుంచి వాంబే వాసులకు విముక్తి
లెగసీ వేస్ట్‌మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే వాసు

  • లెగసీ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి

రాజమహేంద్రవరం సిటీ, మే 24(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలోని ఆర్‌అండ్‌బీ వాంబే కాలనీ, సమీప ప్రాంతాల ప్రజలకు డంపింగ్‌యార్డు దుర్వాసన నుంచి ఇన్నాళ్లకు విముక్తి కలిగిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక పేపరుమిల్లు రోడ్డులోని ఆర్‌అండ్‌బీ వాంబే కాలనీకి సమీపంలోని డంపింగ్‌ యార్డులో రూ.5.72 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన లెగసీ వేస్ట్‌ మెనేజ్‌మెంట్‌ ప్లాంట్‌ను ఆయన ముఖ్యఅతిథిగా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్లాంట్‌లో బయోట్రీట్‌మెంట్‌ అయ్యాక ఇక్కడ చెత్తకు సంబంధించి చిన్న వ్యర్ధం కూడా ఉండదన్నారు. ఆరునెలలలో పూర్తవుతుందని, అక్టోబరు 2 నాటికి స్థానిక 42,45,46 డివిజన్ల ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటారని తెలిపారు. చెత్త ట్రీటెమ్మెంట్‌ జరిగాక మిగిలిన వాటిని ఇక్కడనుంచి తరలిస్తారన్నారు. కాకినాడ మాదిరిగా జిందాల్‌ తో ఒప్పందం చేసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వంలో ఎంవోయూ అయ్యిందన్నారు. మంత్రి నారాయణ ఆరెకరాల భూమిలో చర్యలు చేపట్టారని చెప్పారు. అర్‌అండ్‌బీ వాంబే కాలనీలో గత ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన కమ్యూనిటీ హాలును తిరిగి బాగు చేయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, కొయ్యల రమణ పాల్గొన్నారు.

  • కార్యకర్త కుటుంబానికి బీమా అందజేత

రాజమహేంద్రవరంలో ఇటీవల మృతిచెందిన స్థానిక 14వ డివిజన్‌కు చెందిన టీడీపీ కార్యకర్త భోగారపు త్రినాథ్‌ కుటుంబానికి రూ.5లక్షల బీమా లేఖను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అందించారు. శనివారం త్రినాథ్‌ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే బీమా చెక్కును త్రినాథ్‌ తల్లి నాగమల్లేశ్వరి బ్యాంక్‌ ఖాతాకు జమచేస్తూ మంత్రి నారా లోకేశ్‌ పంపిన లేటర్‌ను ఆమెకు అందించారు. ఈ సందర్భంగా కార్యకర్తను కుటుంబ సభ్యుడిగా భావించేది టీడీపీ మాత్రమేనని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణ మూర్తి, ఈతలపాటి రవిబాబు, బంగారు నాగేశ్వరరావు, యర్రంశెట్టి రాజ్‌ కుమార్‌, నీలాపు వెంకటేశ్వరరావు, ఉడమల నాగేశ్వరరావు, మోర్స సోమరాజు, గొర్రిపర్తి ప్రతాప్‌ పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2025 | 12:04 AM