‘నన్నయ’లో అంతర్ కళాశాలల రెజ్లింగ్ పోటీలు, ఎంపికలు
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:35 AM
దివాన్‌చెరువు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రెజ్లింగ్ పురుష, మహిళల అంతర్‌కళాశాలల పోటీలు, విశ్వవిద్యాలయం జట్టు ఎంపికలు సోమవారం నిర్వహించారు. ఈ పోటీలను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ప్రారంభించారు. విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల నుంచి 51 మంది పురుష, మహిళ క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళల ఫ్రీస్టైల్ విధానంలో 50
దివాన్‌చెరువు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రెజ్లింగ్ పురుష, మహిళల అంతర్‌కళాశాలల పోటీలు, విశ్వవిద్యాలయం జట్టు ఎంపికలు సోమవారం నిర్వహించారు. ఈ పోటీలను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ప్రారంభించారు. విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల నుంచి 51 మంది పురుష, మహిళ క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళల ఫ్రీస్టైల్ విధానంలో 50 నుంచి 76 కిలోల కేటగిరి వరకూ జరిగాయి. వారిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులను విశ్వవిద్యాలయం జట్టుగా ఎంపికచేసి ఈ నెల 27 నుంచి 30 వరకూ రాజస్థాన్‌లో కోటా విశ్వవిద్యాలయంలో జరిగే సౌత్ జోన్ పోటీలకు పంపుతారు. అలాగే రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ విధానంలో 57 కిలోల నుంచి 125 కి లోల వరకూ క్రీడాకారులు పాల్గొని సత్తాచాటారు. రెజ్లింగ్ గ్రీకో రోమన్ విధానంలో 55 కిలోలనుంచి 130 కిలోల కేటగిరి వరకూ క్రీడాకారులు పాల్గొని సత్తాచాటారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన వారిని విశ్వవిద్యాలయ జట్టుగా ఎంపిక చేసి పంజాబ్‌లోని చండీగడ్ విశ్వవిద్యాలయంలో జరిగే సౌత్‌జోన్ పోటీలకు పంపుతారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కెవి.స్వామి, క్రీడాబోర్డు సహాయ కార్యదర్శి ఎంవివిఎస్.మూర్తి, కార్యనిర్వాహక చైర్మన్ డి.జ్యోతిర్మయి పరిశీలకులు నరసింహరాజు ఎంపిక కమిటీ సభ్యులు కె.కనకదుర్గ, ఏ.ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు.