Share News

రియల్‌..లాస్‌!

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:50 AM

మంత్రదండాన్ని బయటకు తీసినా ఈ ఏడా ది రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యంగా కనిపిస్తోంది.2024-25 ఆర్థిక సం వత్సరం ముగింపునకు ఇంకా 10 రోజులు మా త్రమే సమయం ఉంది.

రియల్‌..లాస్‌!

ముగుస్తున్న ఆర్థిక సంవత్సవరం

మరో 10 రోజులే గడువు

ఇంకనూ పూర్తికాని లక్ష్యం

64 శాతమే రిజిస్ట్రేషన్లు

ఈ ఏడాది లక్ష్యం రూ.70 కోట్లు

కేవలం రూ.45 కోట్లే ఆదాయం

లక్ష్యానికి చేరువగా అనంతపల్లి

దూరంగా వేగేశ్వరపురం

కష్టంగా మారిన లక్ష్య సాధన

నవంబరు నుంచి నత్తనడక

గత వైసీపీ 2.0నే కారణం

నేటికీ కోలుకోని తీరు

మందకొడిగా లావాదేవీలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

మంత్రదండాన్ని బయటకు తీసినా ఈ ఏడా ది రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యంగా కనిపిస్తోంది.2024-25 ఆర్థిక సం వత్సరం ముగింపునకు ఇంకా 10 రోజులు మా త్రమే సమయం ఉంది. జిల్లాలో ఇంకా 70 శాతం లక్ష్యాన్ని కూడా ఆ శాఖ చేరుకోలేదు. వాస్తవానికి ఐదు నెలల నుంచీ రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతున్నాయి. కారణాలేమైనప్ప టికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ దశలోనూ రిజిస్ట్రేషన్లు పుంజుకోడానికి అధికా రులు చొరవ చూపలేదనే విమర్శలు వినవస్తు న్నాయి. జిరాక్సు కాపీలు ఇస్తామంటూ గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అయోమయంలో నెలలు గడిచిపోవడం,మరోవైపు రియల్‌ ఎస్టేటు రంగం కుదేలు కావడం కూడా రాబడి ని తగ్గిం చిందని చెబుతున్నారు.జిల్లాలో నత్తనడ కన సాగుతున్న రిజిస్ట్రేషన్లపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.

ఆదాయానికి గండి

రిజిస్ట్రేషన్ల ఆదాయానికి జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం భారీ గండి పడింది. గత నవం బరు నుంచీ రిజిస్ట్రేషన్లు నత్తన డకన సాగుతు న్నాయి.గతేడాది ఎన్ని కల సంవత్సరం కావ డంతో కాస్త ఇబ్బంది ఏర్పడింది. వైసీపీ ప్రభు త్వంలో తీసుకొచ్చిన కార్డ్‌ప్రైం 2.0 లోని సమ స్యలు దానికి తోడయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుదు రుకోడానికి సాధారణంగానే సమయం పట్టింది.ఆ సమ యంలో రిజిస్ట్రేషన్ల శాఖ కూడా పెద్దగా పట్టిం పులేకుండా పని చేసింది.దీంతో గత నవంబరు నుంచీ రిజిస్ట్రేషన్లలో తీవ్ర మందగ మనం నడుస్తోంది.జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంగా రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతుం టాయి.కానీ ఈ జనవరి దానికి భిన్నంగా ఫలి తాలను ఇచ్చింది.ఫిబ్రవరి 1 నుంచీ భూముల ధరలు కాస్త పెరగడం కూడా ప్రభావం చూపింది. వివిధ రకాల కారణాలతో రియల్‌ ఎస్టేట్‌ పడకేసింది. దీంతో రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా తగ్గింది.మార్చి 31ని ముం దుకు జరి పితే తప్ప ఏమి చేసినా ఈ ఏడాది లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమనే చెప్పవచ్చు.

70 శాతానికీ..చేరుకోలేదు

ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయం లక్ష్యా న్ని ఛేదించడం మాట అలా ఉంచితే కనీ సం 70 శాతాన్ని అందుకోలేకపో యింది. ఈ ఆర్థిక ఏడా ది లక్ష్యం రూ.70 కోట్లు కాగా రూ.45 కోట్లు దాటి నెమ్మదిగా అడుగులు వేస్తోంది. జిల్లాలోని రిజిస్ట్రేషన్ల శాఖకు ప్రధాన ఆదాయ వనరు లుగా చెప్పుకోదగిన కడియం,రాజమహేంద్ర వరం,రాజానగరం, పిడింగొయ్యి సబ్‌-రి జిస్ట్రారు కార్యాలయాలు పూర్తిగా నిరాశ పరి చాయి. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ పది రోజుల్లో రాజమహేంద్రవరం 8 కోట్లు,కడియం రూ.2.40 కోట్లు, పిడిం గొయ్యి రూ.2.30 కోట్లు, రాజానగరం రూ.5 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయా ల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనికా దని అధికారులు సైతం చేతులెత్తేస్తు న్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం రాబడిలో మొదటి మూడు స్థానాల్లో అనంతపల్లి, అనపర్తి, కొవ్వూరు ఉండగా వేగే శ్వరపురం చివరి స్థానంలో ఉంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కొద్ది రోజులుగా జిల్లాపై దృష్టి సారించినా ఫలితాలు ఆశాజనకంగా కనిపించకపోవడం గమనార్హం.

జిల్లాలో రిజిస్ట్రేషన్లు ఇలా..

ఎస్‌ఆర్‌వో లక్ష్యం(లక్షల్లో) 20వ తేదీకి శాతం

అనపర్తి 2319.01 1688.05 72.79

అనంతపల్లి 3166.16 2820.39 89.08

బిక్కవోలు 2644.40 1893.14 71.59

కడియం 5955.22 3637.60 61.08

కోరుకొండ 3203.80 1619.30 50.54

కొవ్వూరు 5759.41 4180.24 72.58

నిడదవోలు 4488.22 2866.70 63.87

పిడింగొయ్యి 7165.07 4732.48 66.05

రాజమహేంద్రవరం 23034.97 15121.71 65.65

రాజానగరం 9421.49 4938.15 52.41

సీతానగరం 982.62 678.15 69.01

వేగేశ్వరపురం 2003.99 917.35 45.78

మొత్తం 70144.36 45093.26 64.29

Updated Date - Mar 21 , 2025 | 12:50 AM