ఆవేదన.. ఆక్రందన..
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:57 AM
జీజీహెచ్(కాకినాడ) అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): రాయవరం మండలం కొమరిపాలెం శివారు వి.సావరం గ్రామ ంలోని బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం జరిగిన భారీ విస్ఫోటనంలో తీవ్రగాయాల పాలైన క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో 90 శాతంపైన కాలిపోయిన ఇద్దరు మహిళలు, ఒక యువకుడికి జీజీహెచ్ అత్యవసర విభాగంలో వివిధ విభాగాల వైద్య నిపుణులు ప్రథమ చికిత్స అందిస్తుం
బాణసంచా పేలుడు ఘటన క్షతగాత్రులకు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స .. బాధిత కుటుంబీకుల రోదనలు
జీజీహెచ్(కాకినాడ) అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): రాయవరం మండలం కొమరిపాలెం శివారు వి.సావరం గ్రామ ంలోని బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం జరిగిన భారీ విస్ఫోటనంలో తీవ్రగాయాల పాలైన క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో 90 శాతంపైన కాలిపోయిన ఇద్దరు మహిళలు, ఒక యువకుడికి జీజీహెచ్ అత్యవసర విభాగంలో వివిధ విభాగాల వైద్య నిపుణులు ప్రథమ చికిత్స అందిస్తుండగా క్షతగాత్రుల రోదనలతో ఆ ప్రాంతం దిక్కులు పికటిల్లేలా మిన్నంటింది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన 45 ఏళ్ల వాసంశెట్టి విజయలక్ష్మికి భర్త వెంకట్రావు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒక కుమార్తె దుర్గ కూడా తల్లితోపాటు గతేడాది కాలంగా ఆ బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తోంది. అలాగే అనపర్తికి చెందిన 30 ఏళ్ల చిట్టూరి యామినికి భర్త శ్రీను, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఆమె గతేడాది కాలంగా పని చేస్తోంది. అలాగే పెదపూడి మండలం వేండ్ర గ్రామానికి చెందిన 21 ఏళ్ల లింగం వెంకటకృష్ణ అలియాస్ చిన్నాకు తండ్రి రాము, తల్లి వెంకటలక్ష్మి, అన్నయ్య చంద్రశేఖర్ ఒక అక్క ఉన్నారు. కాగా వెంకటకృష్ణ గత 5ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్నాడు. అయితే బాణసంచా తయారీ కేంద్రంలో చిచ్చు బుడ్డును సుత్తితో దట్టించే క్రమంలో అగ్ని నెరుసులు విరజిమ్మి బాణసం చా మందుపై పడడంతో ఈ విస్ఫోటనం జరిగినట్టు ప్రమాదం నుం చి తప్పించుకుని క్షేమంగా బయట పడ్డ కార్మికులు చెప్పారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి 48 గంటలు దాటితే కాని చెప్పలేమని సర్జరీ వైద్యులు డాక్టర్ శివకుమార్, డాక్టర్ అభిలాష్ తెలిపారు.
నేడు పోస్టుమార్టం..
రామచంద్రపురం(ద్రాక్షారామ), అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): రాయవరం ప్రమాద ఘటనలో సజీవ దహనమైన ఆరుగురి మృతదేహాలను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలకు గురువారం పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటు ంబీకులకు అందజేయనున్నట్టు ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ప్రవీణ్ చెప్పా రు. కాకినాడలో మరణించిన మరో వ్యక్తికి అక్కడే పోస్టుమార్టం చేయనున్నారు.
3 కుటుంబాల్లో విషాదం..
అనపర్తి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): బాణసంచా ప్రమాదంలో అనపర్తికి చెం దిన ముగ్గురు మహిళలు సజీవదహనం కావడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గత 3నెలలుగా బాణా సంచా తయారీకి అనపర్తి నుంచి 16 మంది మహిళలు పనిచేసేందుకు వెళ్తు న్నారు. బుధవారం ఆరుగురు మాత్రమే పనికి వెళ్లగా ముగ్గురు సజీవదహనం కా గా, మరో మహిళ తీవ్ర గాయాలతో పోరాడుతోంది. మరో ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. మృతిచెందిన వారి లో అనపర్తి సావరానికి చెందిన కురుపూడి జ్యోతి (51), పెంకే శేషారత్నం(38), చిట్టూరి శ్యామల(33) ఉన్నారు. మరో మహిళ చిట్టూరి హేమ తీవ్రగాయాలతో కాకినాడఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.