Share News

కడతారా.. లేదా?

ABN , Publish Date - Aug 07 , 2025 | 01:55 AM

నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే జాతీయ రహదారి అది. ఆ సెంటర్‌ దాటాలంటే ట్రాఫిక్‌ సమస్యలు, అతివేగం కారణంగా రోడ్డు ప్రమాదాలతో హడలిపోయే పరిస్థితి. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు రాకపోకలు సాగించే సమయాల్లో ఏదైనా ప్రమాదం జరిగి ట్రాఫిక్‌ నిలిచిపోతే అధికారులు హడావిడి చేయడం తర్వాత పట్టించుకోరు. ఇది షరా మామూలే.

కడతారా.. లేదా?
రావులపాలెం కళావెంకట్రావు సెంటర్‌

  • రావులపాలెంలో ఫ్లైఓవర్‌ నిర్మాణం జరిగేనా?

  • సర్వేలే తప్ప కార్యరూపం దాల్చని వైనం

  • ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు

నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే జాతీయ రహదారి అది. ఆ సెంటర్‌ దాటాలంటే ట్రాఫిక్‌ సమస్యలు, అతివేగం కారణంగా రోడ్డు ప్రమాదాలతో హడలిపోయే పరిస్థితి. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు రాకపోకలు సాగించే సమయాల్లో ఏదైనా ప్రమాదం జరిగి ట్రాఫిక్‌ నిలిచిపోతే అధికారులు హడావిడి చేయడం తర్వాత పట్టించుకోరు. ఇది షరా మామూలే. ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముఖద్వారమైన రావులపాలెం జాతీయ రహదారిపై ఉన్న కళా వెంకట్రావు సెంటర్‌ మీదుగా వందలాది వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోతుంటే వాహనచోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్‌ కట్టాలన్న డిమాండ్‌ ఎప్పటినుంచో ఉంది. కానీ అది ఎప్పటికీ కలగానే మిగిలిపోతోంది.

(ఆంధ్రజ్యోతి-రావులపాలెం)

రాజమహేంద్రవరం, కాకినాడ వంటి నగరాల్లోని ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్‌ స మస్యలు తలెత్తకుండా ఫ్లైఓవర్‌ నిర్మాణా లు చేపట్టారు. రావులపాలెంలో మాత్రం సర్వేలు,వ్యాపారులతో సమావేశాలు తప్ప నిర్మా ణ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలులేవు. చెన్నై-కోల్‌కత్తామార్గంలో 216(ఏ) జాతీయరహ దారి రావులపాలెం, ఆలమూరు మండలాల్లో 25కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. జిల్లాలోని ప్రజలు అధికారులు, జిల్లా కేంద్రమైన అమలాపురం వెళ్లేందుకు ఈ సెంటర్‌ మీదుగానే రాకపోకలు సాగించాల్సి ఉంది. కానీ, ఫ్లైఓవర్‌ నిర్మాణానికి మీనమేషాలు లెక్కించాల్సిన పరిస్థితి.

సర్వేలే తప్ప ఆచరణ శూన్యం

రావులపాడు వంతెననుంచి రావులపాలెం ప్రభుత్వ కళాశాలల సెంటర్‌ వరకూ ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టేందుకు గతంలో అధికారులు స ర్వే చేశారు. ఆ సమయంలో ఇక్కడ ఫ్లైఓవర్‌ నిర్మిస్తున్నారని, ట్రాఫిక్‌ కష్టాలు తీరినట్లేనని ప్ర జలు భావించారు. సర్వే తర్వాత నిర్మాణ దిశగా అడుగు పడకపోవడంతో నిరాశే మిగిలింది.

ఎమ్మెల్యేతో సమావేశం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రావులపాలెంలో నిత్యం ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ సమస్యలను ప్రజలు కొత్తపేట ఎమ్మెల్యే బండా రు సత్యానందరావు దృష్టికి తీసుకువెళ్లారు. దీం తో ఆయన మూడు నెలల క్రితం సర్వే అధికారులు, ఆర్‌అండ్‌బీ, పోలీస్‌, ఇతరశాఖల అధికారులతో రావులపాలెం సెంటర్‌ సమీప ప్రాంతాలను సర్వీసు రోడ్లను పరిశీలించి వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఫ్లైఓవర్‌ నిర్మాణ అ భ్యంతరాలపై చర్చించారు. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల తో మాట్లాడారు. ఇక్కడ సమావేశంలో రావులపాలెం సుందరీకరణకు తనవంతు కృషిచేస్తానని, దానికి అందరూ సహకరించాలని కోరారు. ఈసమావేశం జరిగి మూడునెలలు కావస్తున్నా పనులేవీ ముందుకు కదలలేదు.

ట్రాఫిక్‌ సిగ్నల్‌ లేని హైవే సెంటర్‌

నిత్యం వందలాది వాహనాలతో రాకపోకలు సాగించే రావులపాలెం కళావెంకట్రావు సెంటర్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌కు నోచుకోలేదు. ఫ్లైఓవర్‌ నిర్మా ణం కలగా మిగిలిపోయే పరిస్థితులు కనబడుతున్న నేపథ్యంలో కనీసం అధికారులు సిగ్నల్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తే కొంతమేర ట్రాఫిక్‌ సమస్యలు తగ్గే అవకాశం ఉంది.

ఆక్రమణల చెరలో సర్వీసు రోడ్లు

పాదచారులకు, ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా హైవే నిర్మా ణ సమయంలో రహదారికి అనుసంధానంగా అధికారులు సర్వీసు రోడ్లను ఏర్పాటు చేశారు. అవి ఆక్రమణలకు గురికావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాణిజ్య కేంద్రంగా అభివృ ద్ధి చెందుతున్న రావులపాలెం వ్యాపార కార్యకలాపాలకు నెలవుగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారులు ఇక్కడి షాపులను అ ద్దెకు తీసుకుని నడిపిస్తున్నారు. దీనికి భవన యజమానులకు రూ.లక్షల్లో అద్దెలు వస్తున్నా యి. ఫ్లైఓవర్‌ నిర్మాణం జరిగితే అద్దెలు ఆగిపో తాయని షాపుయజమానులే నిర్మాణాన్ని అడ్డు కుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తవుతున్నాయి.

ప్రయాణికులకు ట్రాఫిక్‌ సమస్య

చెన్నై-కోల్‌కతా హైవేపై వెళ్లే వాహనాలు రా వులపాలెం సెంటర్‌ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ సమయంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే భక్తులు రావులపాలెం వచ్చేసరికి ట్రాఫిక్‌ ఇబ్బందు లు తప్పడంలేదు. ఏడు శనివారాల వెంకన్న దర్శనానికి శనివారం ఒక్కరోజే 60వేలమందికి పైగా భక్తులు ఈసెంటర్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. సుదూర ప్రాంతాలనుంచి సునాయాసంగా వస్తున్న భక్తులు ఇక్కడ ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బందులకు గురవుతున్నారు.

Updated Date - Aug 07 , 2025 | 01:55 AM