Share News

డొంకరాయిలో సినీ సందడి

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:13 AM

మోతుగూడెం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): చింతూరు జిల్లా వె.ౖ రామ వరం మండలం డొంక రాయి గ్రామంలో గురు వారం సినిమా షూటింగ్‌ జరిగింది. సినీ నటుడు రవితేజ హీరోగా నటిస్తు న్న నూతన చిత్రానికి సం బంధించిన డొంకరాయి మార్కెట్‌ సెంటర్లో జిల్లా పరిషత్‌ పాఠశాల ఆవరణ క్రీడామైదానంలో షూటింగ్‌

డొంకరాయిలో సినీ సందడి
మార్కెట్‌ సెంటర్లో సినీనటుడు రవితేజ

సినీ నటుడు రవితేజపై సన్నివేశాల చిత్రీకరణ

మోతుగూడెం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): చింతూరు జిల్లా వె.ౖ రామ వరం మండలం డొంక రాయి గ్రామంలో గురు వారం సినిమా షూటింగ్‌ జరిగింది. సినీ నటుడు రవితేజ హీరోగా నటిస్తు న్న నూతన చిత్రానికి సం బంధించిన డొంకరాయి మార్కెట్‌ సెంటర్లో జిల్లా పరిషత్‌ పాఠశాల ఆవరణ క్రీడామైదానంలో షూటింగ్‌ జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు సన్నివేశాలు చిత్రీకరించారు. రవితేజను చూడడానికి అధికంగా అభిమానులు తరలివచ్చారు. మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ బ్యానర్‌పై దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్‌ హీరోయిన్‌ కాగా.. సాయి కుమా ర్‌, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నెలరోజుల పాటు మొదటి షెడ్యూల్‌ ఈ ప్రాంతాల్లో చిత్రీకరించడానికి రెండో షెడ్యూల్‌ను జనవరి నుంచి నిర్వహించడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తుంది.

Updated Date - Nov 28 , 2025 | 12:13 AM