త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:07 AM
మండపేట, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మం డపేట మండలం కేశవరం రైల్వే గేటు వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అసలు ఏం జరిగిందంటే... విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం ఉద యం 9 గంట లకు కేశవరం రైల్వే గేటు
కేశవరం రైల్వే గేటు వద్ద ట్రాక్‌పై వాహనదారులు
గమనించి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆపివేసిన లోకోపైలెట్
మండపేట, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మం డపేట మండలం కేశవరం రైల్వే గేటు వద్ద త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అసలు ఏం జరిగిందంటే... విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం ఉద యం 9 గంట లకు కేశవరం రైల్వే గేటు వద్దకు చేరు కుంటుండగా రైల్వే గేటు వేసి ఉన్నప్పటికీ ట్రాఫిక్ రద్దీ కార ణంగా పలువురు వాహనదారు లు ట్రాక్ మధ్యలో ఉండిపోయారు. ఆ సమయంలో ప్రజలను గమనించిన లోకోపైలెట్ రైలు ను 5 నిమిషాల పాటు నిలుపుదల చేశాడు. గేటుకు అర కిలోమీటరు ముందే నిలుపుదల చేసి పెను ప్రమాదం జరగకుండా కాపాడాడు. ఒకవేళ గమనించ పోతే ప్రమాదం జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోవల్సి వచ్చే ది. దీంతో లోకో పైలెట్‌ను ప్రజలు అభినందించారు. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత రత్నాచల్ ఎక్స్ ప్రెస్ విశాఖకు బయలుదేరింది.