Share News

వినతుల రి‘కార్డు’

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:18 AM

రేషన్‌కార్డులకు క్యూకడుతున్నారు.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవలే కొత్త రేషన్‌కార్డులకు దర ఖాస్తులు ఆహ్వానించింది.

వినతుల రి‘కార్డు’
గత వారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌ వద్ద అర్జీదారుల క్యూ(ఫైల్‌)

ఉమ్మడి తూ.గో.జిల్లాలో ప్రజల క్యూ

1.27 లక్షల దరఖాస్తులు

కొత్తకార్డులకు 10,555

సభ్యులను చేర్చాలంటూ 97,886

వైసీపీ పాలనలో నో ఛాన్స్‌

ప్రస్తుత ప్రభుత్వంలో అవకాశం

భారీగా వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

రేషన్‌కార్డులకు క్యూకడుతున్నారు.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవలే కొత్త రేషన్‌కార్డులకు దర ఖాస్తులు ఆహ్వానించింది.ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కొత్త రేషన్‌ కార్డుల మంజూరు, అదనంగా కుటుంబ సభ్యు లను చేర్చాలంటూ భారీగా దరఖాస్తులు పోటె త్తుతున్నాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎడాపెడా కార్డుల్లో కోత, అడ్డగోలుగా రద్దు.. కొత్తవారిని చేర్చకపోవడంతో వేలాది మంది నరకయాతన పడ్డారు.ప్రభుత్వం మారాక కార్డు దారులపై సీఎం చంద్రబాబు కరుణ చూపారు. ఆరేళ్ల తర్వాత అవకాశం దక్కడంతో జనం నుం చి భారీగా వినతులు వెల్లువెత్తుతున్నా యి. ఇప్పటి వరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏకంగా 1,27,533 మంది అర్జీలు పె ట్టుకున్నారు. కొత్తకార్డులకు 10,555 మంది, ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చాలం టూ 97,886 మంది విజ్ఞప్తులు చేశారు. అత్యధి కంగా తూర్పు నుంచి 43,189 దరఖాస్తులు వచ్చాయి.

అప్పుడంతా అరాచకమే..

వైసీపీ ఐదేళ్ల పాలన..సంక్షేమ పథకాల అమల్లో కోతలే కోతలు అన్నట్టు సాగింది. రకరకాల నిబంధనలతో రేషన్‌ కార్డులను వేలల్లో ఏరేసింది. ఉమ్మడి జిల్లాలో అప్పట్లో 16.50 లక్షల రేషన్‌కార్డులుండగా అందులో తెల్లకార్డులు 15.69 లక్షలు ఉండేవి. వీటిలో అనర్హులు అధికంగా ఉన్నారని భావించిన అప్పటి ప్రభుత్వం అమరావతి నుంచి 28,500 మంది కార్డుదారుల పేరుతో జాబితాను జిల్లా పౌరసరఫరాలశాఖకు పంపి గుట్టుగా క్షేత్రస్థాయి తనిఖీలు చేసి అం దరి కార్డులు రద్దు చేయాలని ఆదేశించింది. ప్రధానంగా 17,500 మంది కార్డుదారులు సొంత గ్రామాల్లో నివసించడం లేదనే కారణంతో రద్దుచేశారు. వాస్తవానికి వీరంతా పొట్టకూటి కోసం హైదరాబాద్‌,విజయవాడ,చెన్నై,ఢిల్లీ తదితర ప్రాంతాలకు తాత్కాలిక వలస వెళ్లినవారే. ప్రజ లు అప్పట్లో నిర్వహించిన స్పందనలో కార్డుల్లో మార్పులు చేర్పులు, కొత్తవి మంజూరు చేయా లంటూ అనేకసార్లు భారీగా వినతులు ఇచ్చారు.అయినా జగన్‌ సర్కారు చెవికెక్కిం చుకోలేదు. దీంతో అప్పట్లో ప్రతిపక్ష హోదాలో టీడీపీ ఆందోళన బాట పట్టింది. కార్డులను అడ్డగోలుగా ఏరివే యడంపై నిరసనలు చేపట్టింది. ప్రభుత్వం మారిన తర్వాత సీఎం చంద్ర బాబు కార్డుదారుల కష్టాలను గుర్తుంచుకుని పరిష్కా రం కోసం ఆలోచించారు. పౌరస రఫరాలశాఖ అధికా రులతో నిర్వహించిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకు న్నారు. కార్డుల్లో మార్పులు,చేర్పులు చేప ట్టడానికి పచ్చ జెండా ఊపారు. గత నెల 14 నుంచి సచివాలయాల పరిధిలో రేషన్‌కార్డులకు అర్జీలు స్వీకరి స్తున్నారు. రేషన్‌కార్డుల్లో మార్పులు చేర్పులకు ఏడు రకా ల సేవ లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.ఆరేళ్ల తర్వాత అవకాశం రావడంతో ప్రజలు క్యూకడుతున్నారు.

అత్యధికం అవే...

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 1,27,533 మంది నుంచి వినతులు వచ్చాయి.అర్జీల్లో అత్య ధికంగా కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చా లంటూ కోరినవే ఎక్కువ.ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి అత్యధి కంగా 43,189 అర్జీలు వచ్చాయి. వీటి లో రేషన్‌ కార్డుల్లో తమ కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలంటూ 32,942 మంది మొర పెట్టుకున్నారు.బియ్యం కార్డులు విభజించా లంటూ 3,302 మంది, 3,684 మంది కొత్త కార్డులు కావాలని అర్జీలు అందించారు. కాకినాడ జిల్లాలో మొత్తం 42,805 మంది వినతులు అందించారు.ఇందులో కొత్తకా ర్డులు మంజూరు చేయాలని 3,526 మంది, ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యులను చేర్చాలని 32,852 మంది దరఖాస్తు చేసుకున్నారు. కోనసీమ జిల్లా లో మొత్తం 41,539 దరఖాస్తులు వచ్చాయి.వీటిలో అత్య ధికంగా కార్డుల్లో కొత్తగా సభ్యులను చేర్చాలని 32,092 మంది,కొత్త కార్డు లకు 3,345 మంది దరఖాస్తు లు చేశారు.ఇలా వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలన చేయనున్నారు. సచివాలయాల స్థాయిలో వీఆర్వోల నుంచి తహశీల్దార్ల వరకు అయా అర్జీలను విభాగాల వారీగా పరిశీలించి మార్పులు,చేర్పుల ప్రక్రియ చేపట్టనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు లేదని నిరంతరం కొనసా గిస్తామని కార్డుదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చే మాట చెప్పింది.

అర్జీ విభాగం కాకినాడ తూగోజీ కోనసీమ

కార్డుల్లో చిరునామా మార్పు 1,447 1501 1387

ఆధార్‌సీడింగ్‌లో తప్పుల దిద్దుబాట్లు 368 387 356

కొత్తగా సభ్యులను చేర్చడం 32,852 32,942 32,092

కొత్తకార్డుల మంజూరు 3,526 3,684 3,345

కార్డుల తొలగింపు 1,294 1,348 1,154

బియ్యంకార్డుల విభజన 3,296 3,302 3,187

రేషన్‌కార్డుల సరెండర్‌ 22 25 18

మొత్తం 42,805 43,189 41,539

Updated Date - Jun 10 , 2025 | 01:18 AM