రామరాజులంక సమస్యను పరిష్కరిస్తా: ఎమ్మెల్యే
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:33 AM
రామరాజులంకలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరిస్తానని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు.
మలికిపురం, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): రామరాజులంకలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరిస్తానని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. ఆదివారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఆదివారం ప్రాథమిక పాఠశాలల వద్దనున్న వాటరు ట్యాంకును పరిశీలించారు. వాటరు ట్యాంకు కిందిభాగం శిథిలస్థితిలో ఉండడంతో గ్రామస్తులు చూపించారు. త్వరలో ఆ పనులు పూర్తి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. వర్షం వస్తే బాడవ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందని, చదువుకునే పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా రామరాజులంక బాడవ రోడ్డు వెళ్లి పరిశీలించారు. గ్రామంలో మంచినీటి సమస్యలు గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా మంచినీరు, విద్యుత్ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం పంచాయతీ భవనం వద్ద జరిగిన సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎంవీ సత్యవాణి, సర్పంచ్ కాకర శ్రీనివాస్, మాజీ సొసైటీ అధ్యక్షుడు బొరుసు ఉమారావు, ముద్దల శ్రీను, దేశినీడి తాతాజీ, ఉంగరాల బాలాజీ పాల్గొన్నారు.