అమ్మతో కలిసి పాఠశాలకు వెళ్తుండగా మాటేసిన మృత్యువు
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:26 AM
అనపర్తి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని మృత్యువు కబళించింది. అతడి తల్లి, సోదరికి గాయాలయ్యా యి. ఈ విషాద సంఘటన శనివారం ఉదయం అనపర్తి రైల్వే ఓవర్ బ్రిడ్జిపై జరిగింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన కొప్పిశెట్టి శ్రీనివాస్ సౌందర్య దంపతులకు 2వ తరగతి చదువుతున్న రూప, 7వ తరగతి చదువుతున్న నీరాజ్ (12) ఉన్నారు. అయితే వారి చదువుల నిమిత్తం అనపర్తికి మకాం మార్చి పిల్లలను స్థానిక శ్రీచై తన్య పాఠశాలలో చేర్పించారు. రోజూ పిల్లలను తల్లి సౌందర్య తన స్కూటీపై స్కూలుకు తీసు కెళ్లి తీసుకొస్తూ ఉండేది. ఈ క్రమంలో
అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొన్న స్కూటీ
విద్యార్థి మృతి
తల్లి, సోదరికి గాయాలు
అనపర్తిలో ఘటన
అనపర్తి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని మృత్యువు కబళించింది. అతడి తల్లి, సోదరికి గాయాలయ్యా యి. ఈ విషాద సంఘటన శనివారం ఉదయం అనపర్తి రైల్వే ఓవర్ బ్రిడ్జిపై జరిగింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన కొప్పిశెట్టి శ్రీనివాస్ సౌందర్య దంపతులకు 2వ తరగతి చదువుతున్న రూప, 7వ తరగతి చదువుతున్న నీరాజ్ (12) ఉన్నారు. అయితే వారి చదువుల నిమిత్తం అనపర్తికి మకాం మార్చి పిల్లలను స్థానిక శ్రీచై తన్య పాఠశాలలో చేర్పించారు. రోజూ పిల్లలను తల్లి సౌందర్య తన స్కూటీపై స్కూలుకు తీసు కెళ్లి తీసుకొస్తూ ఉండేది. ఈ క్రమంలో శనివారం ఉదయం చిన్నారులను స్కూటీపై ఎక్కించుకుని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై నుంచి ప్రయాణిస్తుండగా బండి అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొనడంతో ముగ్గురు గాయాలపాలయ్యారు. నీరజ్ తలకు బలమైన గాయమైంది. ముగ్గురిని స్థానికులు అనపర్తి ఏరియా ఆసు పత్రికి తరలించగా అక్కడి వైద్యులు ప్రథ మ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నీరాజ్ మృ తిచెందాడు. దీనిపై అనపర్తి ఏఎస్‌ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాలకు వెళ్తూ కళ్ల ముందే తమ కొడుకు మృత్యుఒడికి చేరుకోవడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న కలచివేసింది. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం చిన్నారికి నివాళులర్పించి పాఠశాలకు సెలవు ప్రకటించారు.