Share News

ఆదివాసీల ఊపిరి ఆపేస్తారా?

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:43 AM

ఆదివాసీల ఆరోగ్యం కోసం కూటమి ప్రభు త్వం పడుతున్న తపనకు భిన్నంగా నడుస్తున్న రంపచోడవరం మన్యంలోని ప్రభుత్వ రంగ ఆసుపత్రులు ఆదివాసీల ఊపిరి తీస్తున్నాయి. రంపచోడవరంలోని ఏరియా ఆసుపత్రి అయితే మృత్యు కుహారంగా మారి ఇక్కడకు చేరడానికే ఆదివాసీ గర్భిణులు ఆందోళన చెందే దుస్థితి ఏ ర్పడింది. గత ప్రభుత్వంలో అందిన సేవలకు భి న్నంగా అన్ని ఆసుపత్రుల్లోనూ మెరుగైన వైద్య సేవలను అందించాలని ప్రభుత్వం భా

ఆదివాసీల ఊపిరి ఆపేస్తారా?
రంపచోడవరం ఏరియా ఆసుపత్రి

రంపచోడవరం ఏరియా

ఆసుపత్రిలో ఆగని మరణాలు

ప్రశ్నార్థకంగా గర్భిణుల ఆరోగ్యం

అందుబాటులో ఉండని వైద్యులు

చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు

ఆదివాసీ మహిళ మరణం

కేసు స్వీకరించిన జాతీయ కమిషన్లు

(రంపచోడవరం/ఆంధ్రజ్యోతి)

ఆదివాసీల ఆరోగ్యం కోసం కూటమి ప్రభు త్వం పడుతున్న తపనకు భిన్నంగా నడుస్తున్న రంపచోడవరం మన్యంలోని ప్రభుత్వ రంగ ఆసుపత్రులు ఆదివాసీల ఊపిరి తీస్తున్నాయి. రంపచోడవరంలోని ఏరియా ఆసుపత్రి అయితే మృత్యు కుహారంగా మారి ఇక్కడకు చేరడానికే ఆదివాసీ గర్భిణులు ఆందోళన చెందే దుస్థితి ఏ ర్పడింది. గత ప్రభుత్వంలో అందిన సేవలకు భి న్నంగా అన్ని ఆసుపత్రుల్లోనూ మెరుగైన వైద్య సేవలను అందించాలని ప్రభుత్వం భావించి అనేక వసతులను కల్పించినా ఆదివాసీల ప్రాణా లకు ఆసుపత్రుల్లో రక్షణ లేకుండా పోతోంది. కేవ లం 8 నెలల్లో ఒక్క రంపచోడవరం ఏజెన్సీ డివిజ న్‌ పరిధిలోని 7 మండలాల్లోని ఆదివాసీలు చవి చూసిన ఆసుపత్రి మరణాలు వెలుగులోకి వచ్చి నవి కొన్నే అయితే వెలుగు చూడనివి ఎన్నో ఉ న్నాయి. మన్యంలో ఉన్న ఆదివాసీల స్థితి గతు లను దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్‌ స్థాయిలో అన్నిరకాల వైద్య సేవలకు అనుగుణంగా ఆసు పత్రులను తీర్చిదిద్దితే వైద్యులు విధులను విస్మ రించి అవసరానికి అందుబాటులో లేకుం డా పోవడంతో ప్రాణా పాయస్థితుల్లో మరణాలను నివా రించగలిగే అవకాశాలను, మెరుగైన వైద్యం పొందే హక్కులను ఆదివాసీలు కోల్పోతున్నారు. ఒక్క రంపచో డవరం ఏరియా ఆసుపత్రిలో చికి త్స పొంది మరణించిన వారే ఈ సంవత్సరంలో పదివరకూ ఉంటాయని అనధికార అంచనా!

చేతులు దులిపేసుకుని...

పండా సింధూరం అనే ఆదివాసీ మహిళ తన నాల్గో కాన్పు కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో 20 రోజుల పాటు చికిత్స తీసుకున్న అనం తరం బుధవారం ప్రస వానికి తీసుకువెళ్లిన సందర్భంలో బిడ్డ చేతులు బయట కు వచ్చాక ప్రా ణాపాయ స్థితి కి చేరు కోవడం తో అప్పటికపు డు రాజమండ్రికి తరలించి ఇక్కడి ఆసుపత్రి వైద్యు లు చేతులు దులిపేసు కున్నా రు. అయితే రాజమండ్రిలో ఆమె ప్రాణాలు కోల్పోగా, ఆమె కడుపులో ఉన్న బిడ్డను సిజేరి యన్‌ చేసి తీసేందుకు ప్రయ త్నించినా బిడ్డ ప్రాణాలు కూడా దక్కలేదు. వాస్తవానికి రంపచో డవరం ఏరియా ఆసుపత్రిలో సిజేరయన్‌ చేసేందుకు అవసర మైన అన్ని వసతులూ, సౌకర్యా లూ ఉన్నా సమయానికి సిజేరి యన్‌ చేయ కపోవడమే ఆదివాసీ మహిళ మరణానికి కారణమైంది. అంతకు కొద్దిరోజుల ముందు మరో మహిళను కూడా ఇదే పరి స్థితుల్లో రాజమండ్రికి తరలిస్తుంటే మార్గంమధ్యలో అంబులెన్సులోనే ప్రసవించింది. అంతకు ముందు వై.రామ వరం మండలానికి చెంది న కాకూరి పార్వతి అనే మహిళ కూడా సహజ ప్రసవం సమ య ం లోనే మర ణిం చింది. ఆమెకు కూడా సిజేరియన్‌ చేసే అవకాశం ఉన్నా కాపాడలేదు.

బాధితుల ఫిర్యాదులు

ప్రసవం కల్పించి, తల్లీబిడ్డలను సుర క్షితంగా పంపించే సౌకర్యాలు ఉన్నా ఆ దిశగా పని చేయడంలో రంపచోడవరం ఆసుపత్రి విఫలమైంది. ఆదివాసీల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో సీరియస్‌గా వ్యవహరిస్తున్నప్ప టికీ ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు, కీలక ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణలో రంపచోడవరం కేం ద్రంలో నడుస్తున్న నిర్లక్ష్య మరణాలు ఆగడం లేదు. ఆయా ఘటనలు జరిగినపుడు మొక్కు బడిగా వ్యవహరిస్తూ ఆయా వైద్యులను కాపాడే దిశగానే ఉన్నతాధికారుల చర్యలు ఉండటంతో బాధితులు నేరుగా జాతీయ హక్కుల, జాతీయ గిరిజన కమిషన్లను ఆశ్రయించి ఫిర్యాదులు చేస్తు న్నారు. వై.రామవరం ఆదివాసీ మహిళ మరణం పై ఇప్పటికే జాతీయ హక్కుల కమిషన్‌, గిరిజన కమిషన్లు కేసు నమోదు చేసుకున్నాయి. ఆదివాసీ దినోత్సవ నేపథ్యంలోనైనా ముఖ్యమంత్రి మన్యం పర్యటనలో ఆదివాసీల ఆరోగ్యంపై సీరియస్‌గా స్పందించి ఆరోగ్య సేవలు అందేలా కృషి చేస్తారని ఆదివాసీ సమాజం ఎదురుచూస్తోంది.

వైద్యుల్లో నిర్లక్ష్యం...

ప్రతి ఘటనపైనా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకే కాకుండా మన్యానికి పెద్ద దిక్కుగా ఉన్న రంపచోడవరం ఐటీడీఏ ఉన్నతాధికారికి తెలిసినా ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా చూడలేకపోతున్నారు. ఇక్కడి పరిస్థితిని లోతుగా చూస్తే అన్ని హంగులతో ప్రభుత్వం చర్యలు చేపట్టినా ఆసుపత్రిలో వైద్యులకు చిత్తశుద్ధి కొరవడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందరో ఆదివాసీలు ఆర్థిక పరిస్థితులు బాగోలేక ప్రభుత్వం ఆదుకుంటుందని రంపచోడవరం ఏరియా ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. కానీ ఇక్కడ వైద్యం సులభంగా అందించడం లేదు.

గర్భిణి మృతిపై విచారణ

రంపచోడవరం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఇటీవల నిండుగర్భిణి పండా సింధూరం, గర్భంలో ఉన్న బిడ్డ మృతిపై రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పాడేరు డీసీహెచ్‌ వీరవేణి శుక్రవారం విచారణ ప్రారంభించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శేషారెడ్డి, డాక్టర్లు, సిబ్బందిని విచారించారు. ఈ విచారణ నివేదికను సెకండరీ హెల్త్‌ డైరక్టర్‌కు అందించనున్నట్టు ఆమె తెలిపారు.

Updated Date - Aug 09 , 2025 | 12:43 AM