గిరిజన సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:51 PM
రంపచోడవరం, సెప్టెంబరు 12 (ఆంధ్ర జ్యోతి): గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రంపచోడవరం ఐటీడీఏ పీఏ స్మ రణ్ రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన ఐటీడీఏ పీవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ గిరిజనుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపడుతామ
రంప ఐటీడీఏ పీవోగా స్మరణ్ రాజ్ బాధ్యతల స్వీకరణ
రంపచోడవరం, సెప్టెంబరు 12 (ఆంధ్ర జ్యోతి): గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రంపచోడవరం ఐటీడీఏ పీఏ స్మ రణ్ రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన ఐటీడీఏ పీవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ గిరిజనుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపడుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు చేపడతామన్నారు. ఏపీవో(జీ) డీఎన్వీ రమణ, డిప్యూటీ డైరక్టర్ రుక్మాండయ్య, పీహెచ్‌వో దేవదానం, జీసీసీ డీఎం జయశ్రీ, ఏడీఎంహెచ్‌వో డేవిడ్, డీడీ కార్యాలయ సూపరింటెండెంట్ బి.కిషోర్, ఈఈ ఐ.శ్రీనివాసరావు, డీఎల్‌డీవో కె.కోటేశ్వరరావు, ఎంపీపీ బంధం శ్రీదేవి, జడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, మా జీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ కె.బాలకృష్ణ, ఎం పీటీసీలు తుర్రం వెంకటేశ్వరావు, కుంజం వంశీ, ఉలవల లక్ష్మి, తహశీల్దార్లు తదితరులు ఐటీడీఏ పీవోను మర్యాదపూర్వకంగా కలిశారు.