నా పేరేంటి?
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:40 AM
రాజమండ్రిని రాజమహేంద్రవరంగా పేరు మార్పుచేసి పదేళ్లు దాటినా ఇప్పటికీ రైలుపై రాజమండ్రి, బస్సుపై రాజమహేంద్రవరం అని దర్శనమిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాల యాల బోర్డుల్లో మార్పు లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాజమండ్రి అని పిలుస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రాజమహేం
రాజమండ్రినా.. రాజమహేంద్రవరమా?
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
రాజమండ్రిని రాజమహేంద్రవరంగా పేరు మార్పుచేసి పదేళ్లు దాటినా ఇప్పటికీ రైలుపై రాజమండ్రి, బస్సుపై రాజమహేంద్రవరం అని దర్శనమిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాల యాల బోర్డుల్లో మార్పు లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాజమండ్రి అని పిలుస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరమని సంభోదిస్తోం ది. అధికారిక కార్యకలాపాల్లో కూడా రాష్ట్రానికి ఒక పేరుంటే.. కేంద్రానికి మరో పేరు ఉంటూ అయోమయానికి గురిచేస్తున్నాయి. పేరు మార్చి పదేళ్లు దాటినా పాత పేరునే ఇంకా అధికారిక కార్యక్రమాలు సాగుతున్నాయి. మద్రాసును చె న్నై, అహ్మదాబాద్‌ని ప్రయాగ్‌రాజ్ అని పేరు మార్పు చేసిన కొద్ది నెలల్లోనే అటు కేంద్రంలో కూడా కొత్త పేర్లు మనుగడలోకి వచ్చాయి. కానీ రాజమండ్రిని మాత్రం పట్టించుకున్నవాళ్లు లేరు.
రాజమండ్రికి వెయ్యేళ్ల చరిత్ర
రాజమహేంద్రవరానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని రాజరాజనరేంద్రుడు పాలించా డు. ఆయనకు రాజమహేంద్ర అనే బిరుదు ఉంది. దీంతో రాజమహేంద్రవరం అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. తర్వాత క్రమంలో రాజమహేంద్రిగా.. ఆపై బ్రిటిషర్ల పాలనలో రాజ మండ్రిగా రూపాంతరం చెందింది. అందుకే రాజ మండ్రి అనే పేరుకు ఎలాంటి ప్రాతిపదిక కని పించదు. 2015 జూలై 14 నుంచి 25 వరకూ గోదావరికి మహా పుష్కరాలు నిర్వహించారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా సీఎంగా చంద్రబాబు ఉన్నారు. పుష్కరాల చివరి రోజున ఆర్ట్స్ కళాశాల మైదానంలో సీఎం చంద్ర బాబు ప్రసంగిస్తూ.. చారిత్రక ప్రదేశాలు, చరిత్ర ఆనవాళ్లు తెలిపే పేర్లను మార్చడం సబబు కాదని.. రాజమండ్రిని ‘రాజమహేంద్ర వరం’గా పేరు మార్పు చేస్తున్నట్టు ప్రక టించారు. 2015 డిసెంబరు 22న వెలు వడిన జీవో నెం.483 ఆధారంగా కార్పొ రేషన్ కౌన్సిల్ సమావేశంలో పేరు మా ర్పును 20/846 అంశంగా చేర్చి అంగీక రిస్తూ తీర్మానించారు. అయినప్పటికీ ఇప్పటికీ కేంద్ర సంస్థల్లో పేరు మార లేదు. టీడీపీ ప్రభుత్వం తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడంతో పేరు మార్పును పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో కేంద్ర ప్రభుత్వం లో కూడా రాజమహేంద్రవరంగా పేరు మార్చాలని ప్రజలు కోరుతున్నారు.
తెలియక అయోమయం
దూర ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరం వచ్చే వాళ్లు అయోమయానికి గురవుతున్నారు. రైలు, విమాన టికెట్లపై రాజమండ్రి అని ఉం టోంది. ఇక్కడికి వచ్చాక రాజమహేంద్రవర మనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల రిజర్వేషను పోర్టల్‌లో రాజ మహేంద్రవరం అని, రైల్వే పోర్టల్‌లో రాజ మండ్రి ఉండడంతో ఇబ్బంది ఎదురవుతోంది. రైల్వే, పీఎఫ్, పోస్టల్ వంటి కేంద్ర ప్రభుత్వ శాఖలు/సంస్థల కార్యాలయాల బోర్డులు రాజ మండ్రి అని ఉంటున్నాయి. ఉదాహరణకు ఏసీబీ, పీఎఫ్ కార్యాలయాలు ఎదురెదురుగా ఉంటాయి. ఈ బోర్డుపై రాజమహేంద్రవరం, ఆ బోర్డుపై రాజమండ్రి అని రాసి ఉంటుంది. అధికారిక ఉత్తరాలు, కార్యకలాపాల్లోనూ ఈ గందరగోళం గోచరిస్తోంది. ఎంపీని రాజమం డ్రి ఎంపీ అని, ఎమ్మెల్యేని రాజమ హేంద్ర వరం ఎమ్మెల్యే అని వ్యవహరించడం తప్పడం లేదు. ఎంపీ పురందేశ్వరి స్పందించి రాజమ హేంద్రవరం అని పేరు మార్పు చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. పేరు మార్చకుంటే మళ్లీ గోదావరి పుష్కరాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు ఇబ్బందులకు గురికావడం ఖాయంగా కనిపిస్తోంది.