Share News

రమ్యసుధ కృషి అభినందనీయం

ABN , Publish Date - Jun 19 , 2025 | 12:18 AM

రంగంపేట, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఉత్తమ పరిశోధనల ద్వారా అంతర్జాతీయస్థాయిలో తూర్పుగోదావరి జిల్లా రంగంపేట హైస్కూల్‌కి గుర్తింపు తెచ్చిన రమ్యసుధ కృషి అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రశంసించారు. మంగళవారం రాత్రి రాజమహేంద్రవ

రమ్యసుధ కృషి అభినందనీయం
రమ్యసుధను అభినందిస్తున్న పురందేశ్వరి

రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి

రంగంపేట, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఉత్తమ పరిశోధనల ద్వారా అంతర్జాతీయస్థాయిలో తూర్పుగోదావరి జిల్లా రంగంపేట హైస్కూల్‌కి గుర్తింపు తెచ్చిన రమ్యసుధ కృషి అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రశంసించారు. మంగళవారం రాత్రి రాజమహేంద్రవరం ఎంపీ కార్యాలయంలో తనను కలిసిన రంగంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు వి.రమ్యసుధతో మాట్లాడారు. ఈనెల 12, 13వ తేదీల్లో నేపాల్‌ దేశంలోని ఎం ఐటి ఖాట్మండులో అంతర్జాతీయస్థాయిలో ఏర్పా టుచేసిన ఇన్నోవేటివ్‌ ప్రాక్టీస్‌ ఫర్‌ ఆక్సిలరేటెడ్‌గ్రోత్‌ ఇన్‌ కామర్స్‌ హ్యూమానిటీస్‌ సైన్స్‌ అం డ్‌ టెక్నాలజీ అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ సెమినార్‌లో పాల్గొని రీ ఇన్‌ వింటింగ్‌ టుమారో డ్రైవింగ్‌ గ్రోత్‌ త్రు సైంటిఫిక్‌ ఇన్నోవేషన్‌ అనే పరిశోధన పత్రానికి ఉత్తమ పరిశోధనా పత్రం అవార్డు లభించిందన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యార్థులను తీసుకువెళ్లా లని, తమ వంతు ప్రోత్సాహాన్ని అందించాలని బీజేపీ మండలాధ్యక్షుడు మైలవరపు సాయిరా మ్‌ కోరారు. రమ్యసుధ మంచి గుర్తింపు తెచ్చిన పలు అంశాలపై ఎంపీకి ఆయన వివరించారు. మన వంతు ప్రోత్సాహాన్ని రమ్యసుధకు అందింద్దామని ఎంపీ హామీ ఇచ్చారు. నేతల ప్రోత్సాహానికి రమ్యసుధ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 19 , 2025 | 12:18 AM