Share News

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:33 AM

ని యోకవర్గంలో రాబోయే మూడేళ్లలో జరగాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని, నిధులు మంజూరుకు తా ను కృషి చేస్తానని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌ అధ్యక్షతన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది.

నియోజకవర్గ అభివృద్ధికి కృషి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గోరంట్ల

  • జరగాల్సిన పనులపై అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలి

  • కడియం మండల పరిషత్‌ సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల

కడియం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ని యోకవర్గంలో రాబోయే మూడేళ్లలో జరగాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని, నిధులు మంజూరుకు తా ను కృషి చేస్తానని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌ అధ్యక్షతన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథి గా విచ్చేసిన ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ నియోజకవర్గాన్ని రాబోయే మూడేళ్లలో సంపూర్ణంగా అభి వృద్ధి చేయడంపై తాను ప్రణాళికలు సిద్ధం చేశానన్నారు. జలజీవన్‌ మిషన్‌ కింద ప్రతీ ఇంటికి తాగునీరు కోసం ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు చర్యలు వేగవం తం చేయాలన్నారు.పాములమెట్ట కాలనీలో తాగునీరు, విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు ఆయా శాఖలు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.రోడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఆర్‌ అండ్‌బీ అధికారులకు సూచించారు. ఇదిలా ఉండగా పంచాయతీ తీర్మానం లేకుండా తహశీల్దారు ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తికి కట్టబెట్టడం కోసం ఆన్‌లైన్‌ చేయించారని ఎంఆర్‌ పాలెం సర్పంచ్‌ అన్నందేవుల చంటి ఎమ్మెల్యే గోరంట్ల దృష్టికి తీసుకెళ్లా రు. తమ గ్రామ పరిధిలో ఉన్న 92 ఎకరాల ప్రభుత్వ భూ మిలో మట్టిని తవ్వుకుని తీసుకుపోతున్నారని, చెట్లు నరుకుతున్నారని, రెవెన్యూ అధికారులకు చెబుతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. జేగురుపా డు సర్పంచ్‌ యాదల స్టాలిన్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలను సమీపంలోని పాఠశాలల్లోకి విలీనం చేస్తే వారి విద్యాభివృద్ధి జరుగుతుందన్నారు. అలానే కడియం ఎంపీటీసీ గిరజాల బాబు మాట్లాడుతూ తొలగించిన ఐరన్‌ బ్రిడ్జి స్థానంలో మరో వంతెన ఏర్పాటు చేయించాలని కోరారు. సమావేశంలో సర్పంచ్‌లు మాదిశెట్టి పద్మావతి, చెక్కపల్లి మురళి, కొండపల్లి పటియ్య, వైస్‌ ఎం పీపీలు పంతం గణపతి, కలిదిండి విశాలాక్షి, తహశీల్దారు సునీల్‌కుమార్‌,ఎంపీడీవో కె.ర మేష్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కాగా చైతన్యనగర్‌లో సుమారు 70 మంది వరకు ఇళ్లు నిర్మించుకున్నారని వారికి పట్టాలు లేవని శాశ్వత పట్టాలు ఇప్పించాలని సర్పంచ్‌ చంటి కోరారు. అలాగే అక్కడే ఉన్న ఐదేకరాల్లో శ్మశానవాటికలో సుమారు రెండున్న రెకరాల్లో మట్టి తవ్వకాలు జరిగాయని, దాని పక్కన ఉన్న భూమిని స్థానికులకు కేటాయించాలని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

  • తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి: గోరంట్ల

ధవళేశ్వరం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ధవళేశ్వరంలో తాగునీరు సరిగా అందక ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారని నీటి సరఫరాను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి జి. వెంకట్రావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ శ్రీనివాస్‌, ఎంపీడీవో సునీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌, పంచాయతీరాజ్‌ ఏఈ సంపత్‌లను సూచించారు. శుక్రవారం సాయంత్రం పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే గోరంట్ల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో మంచినీటి పథకాల కు నిధులు కేటాయించకపోవడంతో ప్రస్తుతం ఇబ్బం దులు తలెత్తుతున్నాయన్నారు. ఫిల్డర్‌ బెడ్‌లు పాడైపోవడంతో సమస్యలు వస్తున్నాయని ఆర్‌ఎస్‌ఎఫ్‌ ఫిల్డర్‌ బెడ్‌ పనులను పూర్తి చేసేందుకు అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించడంతో రూ.40 లక్షల వ్యయంతో అంచనాలు సిద్ధం చేశారు. ఏపీ పేపర్‌ మిల్లు సహకారంతో గ్రామంలో తాగునీటి సమస్య ప రిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Updated Date - Sep 13 , 2025 | 12:33 AM