Share News

కదలరు..వదలరు!

ABN , Publish Date - Jun 25 , 2025 | 01:22 AM

కదలరు.. వదలరు.. ఉన్నతాధికారు లు కదపలేరు.ఆ సీటుతో అంత సంబంధం మ రి..రాజమహేంద్రవరం నగరపాలక సంస్ధ కా ర్యాలయంలో కొంత మంది ఉద్యోగులు పాతుకుపోయారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాలుగా కదలకుండా కార్పొరేషన్‌ను అంటిపెట్టుకున్నారు.

కదలరు..వదలరు!
రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ కార్యాలయం

  • 4 దశాబ్దాలుగా కార్పొరేషన్‌లో కుర్చీలాట

  • సీట్లు వదలని ఉద్యోగులు

  • పదోన్నతి ఇచ్చినా కదలరు

  • లోలోపలే సర్దుబాటు

  • పాతుకుపోయిన పలువురు

  • పలు విభాగాల్లో ఇదీ పరిస్థితి

  • ఉన్నతాధికారులకు పట్టదు

  • ఇష్టారాజ్యంగా మారిన వైనం

  • ప్రజలకు ఇబ్బందులు

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 24 (ఆం ధ్రజ్యోతి): కదలరు.. వదలరు.. ఉన్నతాధికారు లు కదపలేరు.ఆ సీటుతో అంత సంబంధం మ రి..రాజమహేంద్రవరం నగరపాలక సంస్ధ కా ర్యాలయంలో కొంత మంది ఉద్యోగులు పాతుకుపోయారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు దశాబ్దాలుగా కదలకుండా కార్పొరేషన్‌ను అంటిపెట్టుకున్నారు. ఇంకే ముం ది వారు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టు మారిపోయింది. కారుణ్య నియామకాల్లో వచ్చి న సదరు ఉద్యోగులు అర్హతకు ప్రస్తుతం ఉన్న సీట్లకు అసలు పొంతన లేదు. అయినా వారు చక్రం తిప్పుతున్నారు. పదోన్నతి కల్పించి బదిలీ చేసినా వారికి ఉన్న పలుకుబడితో బదిలీలను నిలుపుదల చేసుకుని వారికి వచ్చిన పదోన్నతిని సైతం వదులుకుంటున్నారంటే ఏ స్థాయి లో హవా నడుపుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ముఖ్యమైన స్థానాల్లో ఇన్‌చార్జిలు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో నేరుగా మునిసిపల్‌ శాఖ నియమించిన సీట్లు కొన్ని అయితే ఇక్కడ లోలోపల సర్దుకున్న సీట్లు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైన అకౌంటెంట్‌, రెవెన్యూ అధికారి, మేనేజరు తదితర పోస్టుల్లో ఇప్పటికి ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. ఇంజనీరింగ్‌ విభాగం, పబ్లిక్‌ హెల్త్‌, టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ విభాగాల్లో కదలకుండా తిష్ఠ వేసుకున్నవారు చాలా మందే ఉన్నారు. కేవలం నాలుగు కుర్చీల ఆట మాదిరిగా నగరపాలక సంస్థలో సేమ్‌ ఉద్యోగి సీట్లు చేంజ్‌ అన్న చందాన గత 20 ఏళ్లకు పైబడి సాగుతుంది. ఒకరిద్దరిని చిన్న మునిసిపాలిటీలకు కమిషనర్‌గా పదోన్నతి కల్పించి బదిలీ చేసిన వారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థను పట్టుకుని వదలడం లేదు. వచ్చిన ప్రతి కమిషనర్‌ దీనిని ప్రక్షాళన చేయడంలో వైఫల్యం చెందుతున్నారు.

కార్పొరేషన్లలో బదిలీలు లేవు

నగరపాకల సంస్థ నుంచి వేరొక నగరపాలక సంస్థకు ఉద్యోగులు, కొంత మంది అధికారుల బదిలీలు లేకపోవడంతో కార్పొరేషన్‌లో జావాబుదారీ తనం సన్నగిల్లింది. కొంతమంది ఉద్యో గులు కీలకమైన సీట్లలో పాతుకుపోయారు. దీనిని 2014 -2019 మధ్యలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మేయర్‌ పం తం రజనీ శేషసాయి నగరపాలక సంస్థ నుంచి నగరపాలక సంస్థకు హెచ్‌వోడీలను బదిలీ చేసే జీవో కోసం ప్రయత్నం చేశారు. అప్పటి పురపాలక శాఖ మంత్రి ప్రస్తుత మంత్రి పి నారాయణను కలిసి లేఖను అం దించారు.అయితే ఆ లేఖను అప్పటిలో పరి గణనలోకి తీసుకోలేదు. కారుణ్య నియమకాల్లో ఉద్యోగాలు పొందిన వారు ఇక్కడనే సర్వీసును పూర్తి చేసుకుని ఇక్కడే పదవీ విరమణ చేసిన సందర్భాలుఉన్నాయి.హెచ్‌వోడీలు,కీలక సీట్లలో పనిచేస్తున్న వారికి బదిలీల్లేక మెరుగైన సేవ లు సాధ్యం కావడంలేదు.ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి జీవో జారీ చేసి బదిలీలు చేస్తే పారదర్శక పాలన సాధ్యమవుతుందనే వాదన వినిపోస్తోంది.

Updated Date - Jun 25 , 2025 | 01:22 AM