Share News

రాజమహేంద్రవరంలో బ్యాంకు ఉద్యోగుల ధర్నా

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:00 AM

ఏఐబీఈఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రైవేట్‌ బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని కరూర్‌ వైశ్య బ్యాంకు ఎదుట జిల్లా బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

రాజమహేంద్రవరంలో బ్యాంకు ఉద్యోగుల ధర్నా
ధర్నాలో మాట్లాడుతున్న బ్యాంకు ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మీపతిరావు

రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ఏఐబీఈఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రైవేట్‌ బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని కరూర్‌ వైశ్య బ్యాంకు ఎదుట జిల్లా బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఎంప్లాయీస్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ జిల్లా కార్యదర్శి లక్ష్మీపతిరావు మాట్లాడుతూ ప్రైవేట్‌ బ్యాంకులను జాతీయకరణ చేయాలని, క్లరికల్‌ నియామకాలు జరపాలని,ఫెడరల్‌ బ్యాం కుల్లో విక్టిమైజేషన్‌ రద్దు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.ధర్నాలో బ్యాంకు ఉద్యోగులు సోమరాజు, మురళీధర్‌, స్వాతి, రమేష్‌, అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 01:00 AM